వైభవ్‌ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తాడో తెలిస్తే షాకవ్వాల్సిందే..! | How Much Money Vaibhav Sooryavanshi Earns Per Day Revealed | Sakshi
Sakshi News home page

వైభవ్‌ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తాడో తెలిస్తే షాకవ్వాల్సిందే..!

Sep 14 2026 5:17 PM | Updated on Sep 14 2026 5:17 PM

How Much Money Vaibhav Sooryavanshi Earns Per Day Revealed

source: X

15 ఏళ్ల వయసులోనే ప్రపంచ క్రికెట్‌లో పెను సంచలనంగా మారిన టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ.. డబ్బు సంపాదనలోనూ సంచలనాలు సృష్టిస్తున్నాడు. నివేదికల ప్రకారం వైభవ్‌ ఒక్క రోజు బ్రాండ్ ఎండార్స్‌మెంట్ షూట్‌కు సుమారు రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని AMP Sports & Entertainment వ్యవస్థాపకుడు, CEO ఇంద్రనీల్ దాస్ స్వయంగా చెప్పాడు.

రాబోయే రెండు మూడేళ్లలో వైభవ్‌ బ్రాండ్ విలువ మరింత పెరిగి, ప్రస్తుతం తీసుకుంటున్న ఫీజుకు రెట్టింపు అవుతుందని ఆయన అంచనా వేశాడు.

సచిన్‌తో పోలిక
బ్రాండ్‌ విలువలో వైభవ్‌ను మార్కెట్‌ నిపుణులు దిగ్గజ బ్యాటర్‌ సచిన్‌ టెండూల్కర్‌తో పోలుస్తున్నారు. Houlihan Lokey IPL Valuation Study 2026 ప్రకారం, వైభవ్‌కు ఉన్న ఆకర్షణ సచిన్ స్థాయికి దగ్గరగా ఉంది. భయమెరుగని బ్యాటింగ్‌ శైలి వైభవ్‌ క్రేజ్‌ను మరింత పెంచుతుంది. కొందరు క్రికెటేతర అభిమానులు కేవలం వైభవ్ బ్యాటింగ్‌ చూసేందుకే స్టేడియాలకు తరలి వస్తున్నారు.

13 ఏళ్లకే కోటీశ్వరుడు
వైభవ్ 13 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లో  అడుగుపెట్టి అతి పిన్న వయస్కుడైన కోటీశ్వరుడిగా నిలిచాడు. ఐపీఎల్ 2025కు ముందు రాజస్థాన్ రాయల్స్ అతడిని జట్టులోకి తీసుకుంది. తొలి సీజన్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడిన వైభవ్, 206 స్ట్రైక్‌రేట్‌తో 252 పరుగులు చేశాడు. ఇందులో ఓ సునామీ శతకం కూడా ఉంది.

రెండో సీజన్‌లో మరింత విధ్వంసం
తన రెండో ఐపీఎల్‌ సీజన్‌లో (2026) వైభవ్‌ మరింత రెచ్చిపోయాడు. ఏకంగా 776 పరుగులతో టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గానిలిచాడు. అతడి స్ట్రైక్‌రేట్ ఏకంగా 237.31గా ఉంది.

టీమిండియాలోనూ చోటు
ఐపీఎల్‌లో అద్బుత ప్రదర్శనల తర్వాత బీసీసీఐ కూడా వైభవ్‌పై నమ్మకం ఉంచింది. యూకే పర్యటనకు అతడిని ఎంపిక చేసింది. ఇప్పటివరకు 6 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన వైభవ్‌, ఐపీఎల్‌ తరహా ప్రదర్శనలు చేయనప్పటికీ.. ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపించాడు. 

ఇదీ చదవండి: మావాడు ఇప్పటికే వైభవ్‌ పనిపట్టాడు.. ఇంకేం భయం?: జపాన్‌ కెప్టెన్‌



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement