మహిళల ఆసియా కప్‌-2026 చాంపియన్‌గా భారత్‌ | India emerged as champion of Womens Asia Cup 2026 tournament | Sakshi
Sakshi News home page

Womens Asia Cup 2026: మహిళల ఆసియా కప్‌-2026 చాంపియన్‌గా భారత్‌

Sep 13 2026 11:25 PM | Updated on Sep 13 2026 11:39 PM

India emerged as champion of Womens Asia Cup 2026 tournament

మహిళల ఆసియా కప్‌-2026 టోర్నమెంట్లో భారత్‌ చాంపియన్‌గా అవతరించింది. తద్వారా అత్యధికంగా ఎనిమిదోసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. దుబాయ్‌ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో శ్రీలంకతో తలపడ్డ భారత్‌.. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్లు స్మృతి మంధాన (39 బంతుల్లో 59), షఫాలీ వర్మ (39 బంతుల్లో 68) అర్ధ శతకాలతో ఆకట్టుకుని.. మెరుగైన స్కోరుకు పునాది వేశారు. ముఖ్యంగా షఫాలీ వేగంగా ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది.

ఇక మిగిలిన వారిలో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్ 14, రిచా ఘోష్‌ 17 పరుగులకే పరిమితం కాగా.. ఆఖర్లో కమలిని మెరుపు ఇన్నింగ్స్‌ (5 బంతుల్లో 15 నాటౌట్‌)తో ఆకట్టుకుంది. ఫలితంగా భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో మిథాలి అయోధ్య, కెప్టెన్‌ చమరి ఆటపట్టు, చముడి ప్రబోద తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక... నిర్ణీత 20 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్‌గా నిలిచింది. దాంతో మహిళల ఆసియా కప్‌-2026 టోర్నమెంట్లో భారత్‌ చాంపియన్‌గా నిలిచింది. 

తుదిజట్లు
భారత మహిళల జట్టు
స్మృతి మంధాన, షఫాలీ వర్మ, గుణలన్‌ కమిలిని, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), భారతి ఫుల్మలి, రిచా ఘోష్‌ (వికెట్‌ కీపర్‌), దీప్తి శర్మ, ప్రేమా రావత్‌, శ్రీచరణి, క్రాంతి గౌడ్‌, నందిని శర్మ.

శ్రీలంక మహిళల జట్టు
చమరి ఆటపట్టు (కెప్టెన్‌), ఇమేషా దులాని, విష్మి గుణరత్నె, హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, కవిశా దిల్హరి, నీలాక్షిక సిల్వ, కౌశిని నుత్యాంగన (వికెట్‌ కీపర్‌), సుగందిక కుమారి, చముడి ప్రబోద, మిథాలి అయోధ్య.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement