PC: Sonysports X
దుబాయ్ వేదికగా మహిళల ఆసియా టీ20 కప్ -2026 టోర్నమెంట్ ఫైనల్లో భారత్ టాస్ గెలిచింది. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్.. శ్రీలంకను బౌలింగ్‌కు ఆహ్వానించింది.
UPDATES
👉పదిహేడు ఓవర్లలో భారత్ స్కోరు: 160-2
రిచా 17, హర్మన్ 13 పరుగులతో ఉన్నారు.
👉పదహారు ఓవర్లలో భారత్ స్కోరు: 147-2
రిచా 5, హర్మన్ 12 పరుగులతో ఉన్నారు.
👉పదిహేను ఓవర్లలో భారత్ స్కోరు: 140-2
రిచా 3, హర్మన్ 7 పరుగులతో ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన భారత్
13.4వ ఓవర్: చమరి ఆటపట్టు బౌలింగ్‌లో హర్మన్ పరుగు తీసే క్రమంలో స్మృతితో సమన్వయ లోపం కారణంగా స్మృతి రనౌట్ (39 బంతుల్లో 59) అయింది. రిచా ఘోష్ క్రీజులోకి రాగా.. హర్మన్ 3 పరుగులతో ఉంది. 14 ఓవర్లలో స్కోరు: 134-2.
👉షఫాలీ వర్మ అవుట్
12.5వ ఓవర్: చముడి ప్రబోద బౌలింగ్‌లో చమరి ఆటపట్టుకు క్యాచ్ ఇచ్చిన షఫాలీ (68) తొలి వికెట్‌గా వెనుదిరిగింది. స్కోరు: 130-1 (13). హర్మన్‌ప్రీత్ కౌర్ క్రీజులోకి రాగా.. స్మృతి 58 పరుగులతో ఉంది.
👉పన్నెండు ఓవర్లలో భారత్ స్కోరు: 121-0
షఫాలీ 67, స్మృతి 51 పరుగులతో ఉన్నారు.
👉పదకొండు ఓవర్లలో భారత్ స్కోరు: 113-0
👉స్మృతి హాఫ్ సెంచరీ
షఫాలీ 61 పరుగులతో ఉండగా.. స్మృతి మంధాన 35 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకుంది.
👉పది ఓవర్లలో భారత్ స్కోరు: 98-0
స్మృతి 38, షఫాలీ 59 పరుగులతో ఉన్నారు.
తొమ్మిది ఓవర్లలో భారత్ స్కోరు: 91-0
👉స్మృతి 32, షఫాలీ 58 పరుగులతో ఉన్నారు.
👉24 బంతుల్లోనే షఫాలీ అర్ధ శతకం.. అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో ఆమెకు ఇది 21వ హాఫ్ సెంచరీ.
👉ఎనిమిది ఓవర్లలో భారత్ స్కోరు: 78-0
షఫాలీ 25 బంతుల్లో 53, స్మృతి మంధాన 23 బంతుల్లో 24 పరుగులతో ఉన్నారు.
👉ఏడు ఓవర్లలో భారత్ స్కోరు: 69-0
షఫాలీ 48, స్మృతి 21 పరుగులతో ఉన్నారు.
👉పవర్ ప్లేలో భారత్ స్కోరు: 57-0 (6 ఓవర్లు)
షఫాలీ 19 బంతుల్లో 38 పరుగులతో జోరు మీదుండగా.. స్మృతి 17 బంతుల్లో 19 పరుగులు చేసింది.
👉ఐదు ఓవర్లలో భారత్ స్కోరు: 56-0
షఫాలీ 37, స్మృతి 19 పరుగులతో ఉన్నారు.
👉నాలుగు ఓవర్లలో భారత్ స్కోరు: 35-0
షఫాలీ 18, స్మృతి 17 పరుగులతో ఉన్నారు.
నిలకడగా ఆడుతున్న ఓపెనర్లు
👉మూడు ఓవర్లలో భారత్ స్కోరు: 29-0
👉రెండు ఓవర్లలో భారత్ స్కోరు: 18-0
తొలి ఓవర్లో ఐదు పరుగులే
మిథాలి అయోధ్య పొదుపుగా బౌలింగ్ చేయడంతో భారత్ తొలి ఓవర్లో ఐదు పరుగులే చేసింది. ఓపెనర్లలో స్మృతి మంధాన తొలి బంతికే ఫోర్ బాది ఖాతా తెరవగా.. షఫాలీ సున్నా పరుగులతో ఉంది.
తుదిజట్టులో మార్పు
టైటిల్ పోరు కోసం తమ తుదిజట్టులో ఒక మార్పు చేసినట్లు హర్మన్ టాస్ సందర్భంగా వెల్లడించింది. ప్రతికా రావల్‌కు విశ్రాంతినిచ్చామన్న హర్మన్.. యువ ప్లేయర్ కమలినిని ఆడిస్తున్నట్లు తెలిపింది. కాగా ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల క్రికెట్ జట్టు ఇప్పటి వరకు ఏడుసార్లు చాంపియన్‌గా నిలిచింది.
మరోవైపు.. గత ఆసియా కప్ ఫైనల్లో టీమిండియాను ఓడించి విజేతగా నిలిచిన శ్రీలంక.. ఈసారి కూడా అదే ఫలితం పునరావృతం చేయాలని భావిస్తోంది. అయితే, గత ఎడిషన్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని హర్మన్ సేన పట్టుదలగా ఉంది. దీంతో ఈ పోటీ మరింత రసవత్తరంగా మారింది.
తుదిజట్లు
భారత మహిళల జట్టు
స్మృతి మంధాన, షఫాలీ వర్మ, గుణలన్ కమిలిని, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), భారతి ఫుల్మలి, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, ప్రేమా రావత్, శ్రీచరణి, క్రాంతి గౌడ్, నందిని శర్మ.
శ్రీలంక మహిళల జట్టు
చమరి ఆటపట్టు (కెప్టెన్), ఇమేషా దులాని, విష్మి గుణరత్నె, హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, కవిశా దిల్హరి, నీలాక్షిక సిల్వ, కౌశిని నుత్యాంగన (వికెట్ కీపర్), సుగందిక కుమారి, చముడి ప్రబోద, మిథాలి అయోధ్య.
చదవండి: అఫ్గాన్‌తో తొలి టీ20.. తుదిజట్టులో వైభవ్‌కు దక్కని చోటు


