Photo Credit: Twitter
మహిళల ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్లో భారత్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. షెఫాలీ వర్మ విధ్వంసానికి ఆల్‌రౌండర్ దీప్తి శర్మ మెరుపులు తోడవ్వడంతో హర్మన్ సేన సునాయాసంగా టైటిల్‌పోరుకు అర్హత సాధించింది.
అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఒక ఫేక్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలయ్యింది. టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సోమర్‌సాల్ట్ వేసి మరీ తలకిందులుగా స్టన్నింగ్ క్యాచ్ తీసుకోవడం ట్రెండింగ్‌లో నిలిచింది. అయితే ఇదంతా ఏఐ సహాయంతో రూపొందించిన ఫేక్ వీడియో అని కాసేపటికే తేలిపోయింది. అయినప్పటికీ కూడా క్రికెట్ ఫ్యాన్స్ ఈ వీడియోను ఫన్ కోసం షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.
ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇలాంటి ఫేక్ వీడియోలతో అభిమానులను మిస్‌లీడ్ చేయడం అలవాటుగా మారిపోయింది. వీడియోలో న్యూజిలాండ్ బ్యాటర్ మిడ్ వికెట్ దిశగా భారీ షాట్ ఆడింది. అయితే అక్కడే ఉన్న భారత ఫీల్డర్ అమాంతం గాల్లోకి ఎగిరింది. ఆ తర్వాత సోమర్‌సాల్ట్ వేసి తన కాళ్లతో బంతిని బ్యాలెన్స్ చేసి చేతుల్లోకి తీసుకోవడం కనిపించింది. వాస్తవానికి ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ రివర్స్ ఫ్లిప్‌లో క్యాచ్ అందుకోవడం అసాధ్యం.
ఒకవేళ తీసుకున్నా తలకు పెద్ద గాయమవ్వడం గ్యారంటీ. కానీ ఫీల్డర్ మాత్రం క్యాచ్ తీసుకున్న తర్వాత యథాస్థానానికి రావడం వీడియోలో చూపించారు. ఇదే సమయంలో క్యాచ్ అందుకునే క్రమంలో ఫేస్ చూపించలేదు. కానీ రివర్స్‌ఫ్లిప్ వేసినప్పుడు మాత్రం కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కనిపించగా, క్యాచ్ అనంతరం మరొక ప్లేయర్ కనిపించింది. ఇది ఫేక్ వీడియో అని ఇక్కడే క్లియర్‌గా అర్థమైపోతుంది. ఏఐ టెక్నాలజీ సాయంతోనే వీడియోను మార్ఫింగ్ చేయడంతో పాటు డీప్‌ఫేక్ టెక్నాలజీ సాయంతో వేరే ప్లేయర్ మొహానికి హర్మన్ ఫొటోతో మార్ఫింగ్ చేసినట్లు క్లియర్‌గా తెలుస్తోంది.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. షెఫాలీ వర్మ (64), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (24) రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో సుల్తానా ఖాతున్ 2 వికెట్లు తీయగా, నహిదా అక్తర్, మరుఫా అక్తర్, రబెయా ఖాన్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం బంగ్లాదేశ్ భారత బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులకే పరిమితమైంది. షోర్నా అక్తర్ (22 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచింది.
#viralvídeo
I am confirmed. You have not seen such a catch in your life ☺️ pic.twitter.com/CeRSd1NLtO— Prof.Sarita Sidh (@profsaritasidh) September 10, 2026
చదవండి: 'డీఆర్ఎస్ ఏముందిలే బ్రో.. కాబోయే కెప్టెన్‌వి నువ్వు’


