అదరగొట్టిన బుమ్రా.. అరుదైన ఘనత | IND vs AFG 1st T20I Jasprit Bumrah Scripts Another T20 Milestone | Sakshi
Sakshi News home page

అదరగొట్టిన బుమ్రా.. అరుదైన ఘనత

Sep 13 2026 8:31 PM | Updated on Sep 13 2026 8:42 PM

IND vs AFG 1st T20I Jasprit Bumrah Scripts Another T20 Milestone

బుమ్రా (Photo: BCCI X)

అఫ్గానిస్తాన్‌తో తొలి టీ20తో టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా పునరాగమనం చేశాడు. ఇంగ్లండ్‌ పర్యటన సందర్భంగా గాయపడిన ఈ పేస్‌గుర్రం.. బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొంది పూర్తిగా కోలుకున్నాడు. ఈ క్రమంలో ఫిట్‌నెస్‌ పరీక్ష పాసైన బుమ్రా ఆదివారం నాటి మ్యాచ్‌తో రీఎంట్రీ ఇచ్చాడు.

ఇక ఢిల్లీ వేదికగా టీమిండియాకు అఫ్గాన్‌ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అరుణ్‌ జైట్లీ స్టేడియంలో తొలి టీ20లో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

రెండో బంతికే వికెట్‌
ఈ క్రమంలో బౌలింగ్‌ అటాక్‌ మొదలుపెట్టిన బుమ్రా వైడ్‌తో ఆరంభించినప్పటికీ.. రెండో బంతికే అఫ్గాన్‌ ఓపెనర్‌ రహ్మనుల్లా గుర్బాజ్‌ను అవుట్‌ చేశాడు. బుమ్రా బౌలింగ్‌లో అభిషేక్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి గుర్బాజ్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు.

కాగా టీ20 ఫార్మాట్లో బుమ్రాకు ఇది 350 వికెట్‌ కావడం విశేషం. తద్వారా పొట్టి క్రికెట్‌లో 350 వికెట్ల క్లబ్‌లో చేరిన మూడో భారత బౌలర్‌గా ఈ రైటార్మ్‌ పేసర్‌ నిలిచాడు. అంతకు ముందు స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌, పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ ఈ ఘనత సాధించారు.

టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్లు
యజువేంద్ర చహల్‌- 396 వికెట్లు (హర్యానా, టీమిండియా, ముంబై ఇండియన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌, ఆర్సీబీ )
భువనేశ్వర్‌ కుమార్‌- 363 వికెట్లు (ఉత్తరప్రదేశ్‌, టీమిండియా, ఇండియా-ఎ, పూణే వారియర్స్‌, ఆర్సీబీ, సన్‌రైజర్స్‌, )
జస్‌ప్రీత్‌ బుమ్రా - 350 వికెట్లు* (గుజరాత్‌, టీమిండియా, ముంబై ఇండియన్స్‌).

చదవండి: షఫాలీ మెరుపు హాఫ్‌ సెంచరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement