పురుషుల జూనియర్ హాకీ ఆసియా కప్-2026 టోర్నమెంట్లో భారత్ చాంపియన్‌గా నిలిచింది. సౌత్ కొరియాతో ఆదివారం జరిగిన ఫైనల్లో అన్మోల్ ఎక్కా బృందం.. 4-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా టైటిల్‌ను నిలబెట్టుకున్న భారత జట్టు.. వరుసగా నాలుగోసారి చాంపియన్‌గా నిలిచిన ఘనత సాధించింది. మొత్తంగా ఆరుసార్లు టైటిల్ గెలిచిన జట్టుగా నిలిచింది.
సెమీస్‌లో మలేషియాపై గెలుపు
యూత్ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో భారత జట్టు.. ఆసియా కప్ గ్రూప్ దశలో మూడు గెలిచి.. ఒక మ్యాచ్ డ్రా చేసుకుంది. తద్వారా టాపర్‌గా నిలిచింది. ఇక సెమీ ఫైనల్లో మలేషియాను 3-1 గోల్స్ తేడాతో ఓడించిన భారత్.. ఫైనల్లో సౌత్ కొరియాతో తలపడింది.
చైనాలోని మోకీ వేదికగా ఆదివారం జరిగిన టైటిల్ పోరులో ఆధిపత్యం కనబరిచిన భారత జట్టు.. ప్రత్యర్థిని 4-1 తేడాతో ఓడించింది. తద్వారా ఆసియా టైటిల్ గెలవడంతో పాటు.. జూనియర్ హాకీ ప్రపంచప్ బెర్తును ఖరారు చేసుకుంది.
గోల్స్ కొట్టింది వీరే
భారత్ తరఫున అజిత్ యాదవ్ తొమ్మిదో నిమిషంలో.. అన్మోల్ ఎక్కా 13వ నిమిషంలో.. ప్రభ్‌దీప్ సింగ్ 21వ నిమిషంలో.. అషూ మౌర్య 50వ నిమిషంలో గోల్స్ కొట్టారు. సౌత్ కొరియా తరఫున లీ మిన్హెయోక్ (54వ నిమిషం)లో ఏకైక గోల్ కొట్టాడు. అంతకు ముందు మహిళల జూనియర్ ఆసియా కప్ ఫైనల్‌లో భారత జట్టు.. చైనాపై 1-0 గోల్స్ తేడాతో గెలుపొందింది.
ఫైనల్లో భారత జట్టు
హర్పాల్, సంజిత్ టిర్కీ, సుఖ్‌విందర్, ప్రభ్‌దీప్ సింగ్, ఆర్యన్ ఎక్స్, వివేక్ లక్రా (గోల్ కీపర్), అజిత్ యాదవ్, జీత్‌పాల్, అన్మోల్ ఎక్కా (కెప్టెన్), అషూ మౌర్య, అద్రోహిత్ ఎక్కా.
సబ్‌స్టిట్యూట్స్
చిరాగ్, గుర్సేవక్ సింగ్, రోహిత్ కుల్లు, మన్మీత్ సింగ్ రాయ్, లవ్‌నూర్ సింగ్, కునాల్ తెవాటియా, అర్జున్ సంతోష్ హర్గూడే.
చదవండి: పిల్లాడి చేష్టలు.. మా మధ్య మంచి అనుబంధం: సంజీవ్ గోయెంకా


