క్యాన్సర్ స్క్రీనింగ్ నుంచి మెరైన్ రోబోటిక్స్ వరకు...
37 అత్యాధునిక ఆవిష్కరణలను ‘బ్రిక్స్’లో ఆవిష్కరించిన కేంద్రం
‘రెసిలియెన్స్.. ఇన్నోవేషన్.. కోఆపరేషన్..
సస్టెయినబిలిటీ’ థీమ్‌కు అనుగుణంగా ప్రదర్శన
ప్రదర్శన ద్వారా ప్రపంచ మార్కెట్లకు భారత స్టార్టప్‌లకు బాట
‘బ్రిక్స్’ బిజినెస్ ఫోరంతో అనుసంధానం
సాక్షి, న్యూఢిల్లీ: 18వ ‘బ్రిక్స్’శిఖరాగ్ర సద స్సు వేదికగా భారత్ తన సాంకేతిక, పరిశోధ నా, స్టార్టప్ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. దేశంలోని ఉన్నత విద్యా సంస్థలు, పరిశోధనా కేంద్రాలు, స్టార్టప్‌లు, ల్యాబొరేట రీలు, రీసెర్చ్ పార్క్‌ల నుంచి వెలువడిన అత్యాధునిక డీప్‌టెక్ ఆవిష్కరణలను ఈ వేదికపై ప్రదర్శించారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్వయంతో ‘బ్రిక్స్’లో ప్రదర్శన ప్రపంచ దేశాలను ఆకట్టుకుంది.
ఈ ప్రదర్శనలో దేశానికి చెందిన 37 అత్యాధునిక డీప్‌టెక్ ఆవిష్కరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రజారోగ్యం, వైద్యం, పునరుత్పాదక ఇంధనం, సముద్ర సాంకేతికత, విద్యుత్ వాహనాలు, మాతా–శిశు ఆరో గ్యం వంటి విభిన్న రంగాలకు చెందిన సాంకేతిక పరిష్కారాలను ఇందులో ప్రదర్శించారు. వాటిలో ము ఖ్యంగా కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యవస్థ, నీటిపై ఏర్పాటు చేసే ఫ్లోటింగ్ సోలార్ పీవీ సాంకేతికత, మెరైన్ రోబోటిక్స్, అరుదైన ఖనిజాల అవసరం లేని రేర్ ఎర్త్ ఫ్రీ ఈ–పవర్‌ట్రెయిన్లు, ఏఐ ఆధారిత తల్లి– గర్భస్థ శిశువు ఆరోగ్య పర్యవేక్షణ వ్యవస్థ వంటి వినూత్న పరిష్కారాలను ప్రదర్శించారు.
భారత్ ఉన్నత విద్యా వ్యవస్థలో రూపుదిద్దు కుంటున్న ఆవిష్కరణలకు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా కేంద్రం పే ర్కొంది. దేశంలోని స్టార్టప్‌లు, ఉన్నత విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థలు, ప్రయోగ శాలలు, రీసెర్చ్ పార్క్‌లను ప్రపంచంలోని కార్పొరేట్ సంస్థలు, పెట్టుబడిదారులు, ఇంక్యుబేటర్లు, యాక్సిలరేటర్లు, విశ్వవిద్యాల యాలు, పరిశోధనా సంస్థలు, ప్రభుత్వాలు, విదేశాల్లోని భారతీయ పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్‌తో అనుసంధానం చేయడానికి ఇది ఉపయోగపడనున్నట్లు వేదిక సందర్భంగా కేంద్రం పేర్కొంది. ఈ వేదిక ద్వారా భారత ఆవిష్కర్తలకు కేవలం తమ సాంకేతికతను ప్రదర్శించే అవకాశమే కాకుండా పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాలు, వ్యాపార ఒప్పందాలు, అంతర్జాతీయ విపణిలోకి ప్రవేశం వంటి అవకాశాలు లభించనున్నాయి.
‘బ్రిక్స్’ బిజినెస్ ఫోరంతో..
శుక్ర, శనివారాల్లో జరిగిన ‘బ్రిక్స్’ బిజినెస్ ఫోరం కార్యక్రమంతో ఈ ప్రదర్శనను అను సంధానం చేశారు. దీంతో ‘బ్రిక్స్’ సభ్య దేశాలకు చెందిన సీఈఓలు, పెట్టుబడి దారులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపార ప్రముఖులు, పరిశ్రమ ప్రతినిధులతో భారతీయ స్టార్టప్‌లు నేరుగా పరిచయం ఏర్పరుచుకునే అవకాశం లభించింది. బిజినెస్–టు–బిజినెస్(బీ2బీ) సమావేశాలు, టెక్నాలజీ భాగస్వామ్యాలు, పెట్టుబడి చర్చలు, వ్యాపార సంబంధాల ఏర్పాటు అంశాలకు ఈ వేదిక దోహదపడిందని కేంద్రం పేర్కొంది.
భారత్ 2026 ‘బ్రిక్స్’ అధ్యక్షతన నిర్దేశించిన ‘బిల్డింగ్ ఫర్ రెసిలియెన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టెయినబి లిటీ’ అనే థీమ్‌కు అనుగుణంగా ఈ ప్రదర్శనను నిర్వహించారు. బిక్స్ ఎడ్యుకేషన్ ట్రాక్‌లో గుర్తించిన ఐదు ప్రాధాన్య రంగాల్లో ఒకటైన ‘పరిశోధన, ఆవిష్కరణలు, స్టార్టప్ ఎకోసిస్టమ్‌లను బలోపేతం చేయడం’ లక్ష్యాన్ని ఈ ప్రదర్శన ముందుకు తీసుకెళ్తుందని కేంద్రం తెలిపింది. 2026లో భారత డీప్‌టెక్ స్టార్టప్‌ల కోసం నిర్వహిస్తున్న ప్రధాన ఎక్స్‌పోజిషన్‌లలో ఇది రెండోది. తొలి ‘భారత్ ఇన్నోవేట్స్’ కార్యక్రమాన్ని ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలో జూన్ 14 నుంచి 16 వరకు నిర్వహించారు. తాజాగా బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ఢిల్లీలో జరుగుతున్న ఈ రెండో ఎడిషన్ ద్వారా భారత ఆవిష్క రణలను ‘బ్రిక్స్’ దేశాల నాయకులు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, పరిశ్రమల దృష్టికి తీసికెళ్లడం గమనార్హం.
ఆవిష్కర్తలతో విద్యాశాఖ మంత్రి ముచ్చట
కేంద్ర విద్యా శాఖ మంత్రి ప్రల్హాద్ జోషి భారత్ మండపంలోని ఎక్స్ పోజిషన్‌ను సందర్శించి డీప్‌టెక్ స్టార్టప్‌లు, ఆవిష్కర్తలతో మాట్లా డారు. వివిధ రంగాల్లో భారతీయ యువ ఆవిష్కర్తలు రూపొందించిన అత్యాధునిక సాంకేతిక పరిష్కారాలను ఆయన పరిశీలించారు. భారత ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలోని డీప్‌టెక్ స్టార్టప్‌లకు అంతర్జాతీయ స్థాయి వేదిక లభిస్తోందని జోషి పేర్కొన్నారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనే ప్రపంచ నాయకుల ముందు భారతీయ స్టార్టప్‌లు తమ ప్రతిభ, సాంకేతిక సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు ఈ వేదిక ప్రత్యేక అవకాశాన్ని కల్పించిందని వ్యాఖ్యానించారు.


