న్యూఢిల్లీ: బ్రిక్స్ కూటమి ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా రెండు స్మారక తపాలా బిళ్లలను పోస్టల్ శాఖ శనివారం విడుదలచేసింది. ఢిల్లీలో 18వ సమావేశంలో ఈ రెండు పోస్టల్ స్టాంప్‌లను విడుదలచేసినట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఈ రెండు తపాలా బిళ్లలపై ‘బ్రిక్స్: రెండు దశాబ్దాల సహకారం, 2006–2026’ అని ఇంగ్లిష్, హిందీలో ముద్రించారు. పరస్పర విశ్వాసానికి ప్రతీకగా తొలి స్టాంప్‌ను, భారత్ అధ్యక్షత సమావేశాలు, కూటమి దార్శనికత, లోగోను గుర్తుచేస్తూ మరో స్టాంప్‌ను విడుదలచేశారు.


