జిన్‌పింగ్‌ కీలక నిర్ణయం | Chinese President Xi Jinping skips BRICS Summit dinner | Sakshi
Sakshi News home page

జిన్‌పింగ్‌ కీలక నిర్ణయం

Sep 13 2026 5:26 AM | Updated on Sep 13 2026 10:38 AM

Chinese President Xi Jinping skips BRICS Summit dinner

న్యూఢిల్లీ: బ్రిక్స్‌ సదస్సుకు హాజరైన అగ్రనేతల గౌరవార్థం ప్రధాని మోదీ శనివారం రాత్రి ఇచ్చిన విందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ హాజరుకాలేదు. విందులో జిన్‌పింగ్‌ ఎందుకు హాజరుకాలేదనే విషయంలో అధికారికంగా ఎలాంటి కారణాలు వెల్లడికాలేదు. కానీ శిఖరాగ్ర సదస్సులో సుదీర్ఘంగా పాల్గొని అలసిపోయిన ఆయన తన హోటల్‌ గదికి విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లిపోయారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 

బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు ప్రధాన సమావేశానికి హాజరైన అబూదాబి యువరాజు షేక్‌ ఖలీద్‌ బిన్‌ మొహమ్మద్‌ సైతం వెంటనే స్వదేశానికి తిరుగుపయనమయ్యారు. దీంతో ఈయన సైతం బ్రిక్స్‌ గాలా డిన్నర్‌కు గైర్హాజరయ్యారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇతర బ్రిక్స్‌ దేశాల అగ్రనేతలు, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విందులో పాల్గొన్నారు. విందులో అత్యంత రుచికరమైన గుజరాతీ చిరుతిండి అయిన ఖండ్వీ మిలే ఫియులే, కుంభ్‌ గలౌతీ కబాబ్, పనీర్‌ లబాబ్దార్, గుచ్చీ మారి్మక్, క్యారెట్‌–బీన్‌ పొరియల్, చిరుధాన్యాల పులావ్‌లను వడ్డించారు. పాత ఢిల్లీ ఫ్రూట్‌ క్రీమ్, జిలేబీ, షతూత్‌ ఫిర్నీలనూ అందించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement