హెల్మెట్‌ ధరించలేదని కారు డ్రైవర్‌కు జరిమానా | Man Drives Car Wearing Helmet After Being Fined For Not Wearing | Sakshi
Sakshi News home page

హెల్మెట్‌ ధరించలేదని కారు డ్రైవర్‌కు జరిమానా

Sep 13 2026 9:41 AM | Updated on Sep 13 2026 10:34 AM

Man Drives Car Wearing Helmet After Being Fined For Not Wearing

బెంగళూరు: హెల్మెట్‌ ధరించకపోతే ద్విచక్ర వాహనదారులకు పోలీసులు జరిమానా విధించడం సాధారణంగా చూస్తుంటాం. అయితే కారు డ్రైవర్‌ హెల్మెట్‌ ధరించలేదని రూ.500 జరిమానా విధించిన సంఘటన బెళగావి జిల్లా అథణి పట్టణంలో వెలుగు చూసింది. అథణి పట్టణ నివాసి సుభాష్‌ అనే వ్యక్తికి ట్రాఫిక్‌ పోలీసులు ఈ మేరకు నోటీసులు పంపించడంతో ఆశ్చర్యపోయాడు. తరువాత హెల్మెట్‌ పెట్టుకుని కారు డ్రైవ్‌ చేస్తూ వీడియో తీసి తనకు వచ్చిన నోటీసును సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. ఏఐ కెమెరా పనితీరు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.  

ఇదీ చదవండి: రష్యా పోలీసులు చిత్రహింసలు పెట్టారు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement