కర్ణాటక: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో మొదటి నిందితురాలు, నటి పవిత్రగౌడ బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో తనను మరో బ్యారక్‌లోకి బదిలీ చేయాలని 59వ సీసీహెచ్ కోర్టులో అర్జీ దాఖలు చేసింది. అక్రమంగా విలాసాలు కల్పించారని ఆరోపణలు రావడంతో ఆమెను 16 మంది నిందితులున్న బ్యారక్‌లోకి ఇటీవల బదిలీ చేశారు.
అయితే అక్కడ 30 మంది వరకు ఖైదీలున్నారు, రెండే మరుగుదొడ్లు ఉండగా, ఒకదానికి మరమ్మతులు చేస్తున్నారు, ఆ బ్యారక్‌లో ఉండడం ఆమెకు చాలా ఇబ్బందిగా ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. అలర్జీ సంబంధ వ్యాధితో బాధపడుతున్నట్లు కూడా తెలిపింది.


