ఐశ్వర్య గౌడ బెయిల్‌ దరఖాస్తు కొట్టివేత | Court Rejects Bail Plea | Sakshi
Sakshi News home page

ఐశ్వర్య గౌడ బెయిల్‌ దరఖాస్తు కొట్టివేత

Sep 4 2026 8:23 AM | Updated on Sep 4 2026 8:42 AM

Court Rejects Bail Plea

కర్ణాటక: మహిళా ఎస్‌ఐపై చేయి చేసుకున్నారనే ఆరోపణపై నమోదైన కేసుకు సంబంధించి ఎమ్మెల్యే సురేష్‌ గౌడ కుమార్తె ఐశ్వర్య గౌడ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ దరఖాస్తును  శ్రీరంగపట్నం 3వ అదనపు జిల్లా, సెషన్స్‌ కోర్టు కొట్టివేసింది. మండ్య జిల్లా శ్రీరంగపట్నం తాలూకా ఆరతి ఉక్కడలో శ్రీ అహల్యాదేవి ఆలయం వద్ద గతనెల 12న ఎస్‌ఐ సవిత విధుల్లో ఉండగా ఐశ్వర్యగౌడ ఆమెతో గొడవపడింది. 

ఈక్రమంలో ఐశ్వర్య తనపై చేయి చేసుకున్నట్లు క్యాతనహళ్లి పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ ఫిర్యాదు చేశారు. దీంతో ఐశ్వర్యగౌడపై కేసు నమోదైంది. అరెస్ట్‌ భయంతో ముందస్తు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోగా కోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది.  దీంతో ఐశ్వర్యగౌడ అరెస్టు ముప్పును ఎదుర్కొంటున్నారు.   

చదవండి: బ్యారక్‌ మార్చాలని పవిత్ర అర్జీ దాఖలు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement