breaking news
female police
-
అమెరికా ఆటల పోటీలో... మన మహిళా పోలీస్
వేసపోగు శ్యామల... హైదరాబాద్, సైఫాబాద్ ట్రాఫిక్ ఏ.ఎస్.ఐ. ఇంటర్నేషనల్ మాస్టర్స్ గేమ్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ‘2024 పాన్ అమెరికన్ మాస్టర్స్ గేమ్స్’కి ఆహ్వానం అందుకున్నారామె. ఈ నెల 12 నుంచి 21 వరకు యూఎస్ఏలోని ఓహియో రాష్ట్రం, క్లీవ్‌ల్యాండ్‌లో జరగనున్న పోటీల్లో షాట్‌పుట్, డిస్కస్ త్రోలలో పాల్గొంటున్న సందర్భంగా ఆమె తన బాల్యం నుంచి నేటి వరకు తన ప్రస్థానాన్ని ‘సాక్షి’ ఫ్యామిలీతో పంచుకున్నారు.‘‘నేను పుట్టింది ఆంధ్రప్రదేశ్, కర్నూలు పట్టణంలోని సిమెంట్‌నగర్‌లో. నాన్న మిలటరీ ఆఫీసర్ అమ్మ స్టాఫ్‌నర్స్. ఏడుగురు అక్కలు, ఇద్దరు అన్నల గారాల చెల్లిని నేను. మా పేరెంట్స్ మమ్మల్నందరినీ బాగా చదివించారు. నాన్న వారసత్వాన్ని కొనసాగిస్తూ ఒక అన్న మిలటరీలో ఉన్నారు. ఒక అక్క, నేను పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చాం. నా ఫస్ట్ పోస్టింగ్ హైదరాబాద్ నగరంలోని గోపాల్పురం. విద్యార్థి దశ నుంచి మంచి క్రీడాకారిణిని. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఖోఖో, కబడీ, త్రో బాల్, వాలీ బాల్, బ్యాడ్మింటన్‌లో లెక్కలేనన్ని పతకాలందుకున్నాను. షాట్‌పుట్, డిస్కస్‌త్రోలో జాతీయస్థాయి పతకాలందుకున్నాను. కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉంది. నేను ఇప్పుడు మీ ముందు ఇంత అడ్వెంచరస్‌గా కనిపిస్తున్నానంటే కారణం ఈ నేపథ్యమే.ఈ ఉద్యోగం ఆడవాళ్లకెందుకు?స్త్రీపురుష సమానత్వ సాధన కోసం ప్రభుత్వాలు ముందడుగు వేస్తున్నాయి. మాలాంటి ఎందరో పోలీసింగ్, దేశరక్షణ వంటి క్లిష్టమైన విధులను భుజాలకెత్తుకున్నాం. కానీ సమాజం మాత్రం అంత ముందు చూపుతో లేదన్న వాస్తవాన్ని మా డిపార్ట్మెంట్లోనే చూశాను. ‘ఆఫ్టరాల్ ఉమన్, జస్ట్ కానిస్టేబుల్, యూనిఫామ్ వేసుకుని డ్యూటీకి వస్తారు, వెళ్తారు. జీతం దండగ’ అనే మాటలు మేము వినాలనే అనేవాళ్లు. నాలో కసి ఎంతగా పెరిగిపోయిందంటే... వాహనం కొనేటప్పుడు చిన్నవి వద్దని 350 సీసీ బుల్లెట్ తీసుకున్నాను. ‘ఏ అసైన్మెంట్ అయినా ఇవ్వండి’ అన్నాను చాలెంజింగ్‌గా. నైట్ పెట్రోలింగ్ చేయమన్నారు.అది కూడా సింగిల్‌గా. ఒక్కరోజు కూడా విరామం తీసుకోకుండా వరుసగా 60రోజులు రాత్రి పది నుంచి రెండు గంటల వరకు బైక్ మీద హైదరాబాద్ సిటీ పెట్రోలింగ్ చేశాను. ఆ డ్యూటీతో వార్తాపత్రికలు, టీవీలు నన్ను స్టార్‌ని చేశాయి. ‘ఎంటైర్ ఆల్ ఇండియా చాలెంజింగ్ ఉమన్ ఆఫీసర్’ అని అప్పటి సీపీ అంజనీకుమార్ సత్కరించారు. బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్లో ఫైళ్లను త్వరితగతిన క్లియర్ చేసిన మహిళా కానిస్టేబుల్‌గా ఏసీపీ రంగారావు చేతుల మీదుగా సత్కారం అందుకున్నాను.బుల్లెట్ పై వస్తా... ఆకతాయిల భరతం పడతా!పోలీసులంటే శాంతిభద్రతలు, ట్రాఫిక్ నిర్వహణకు మాత్రమే పరిమితం కాకుండా సమాజంలో ఉన్న సమస్యలన్నింటినీ అడ్రస్ చేయాలి. ఆ ప్రయత్నంలో భాగంగా ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్, భరోసా, షీ టీమ్స్, తెలంగాణ స్టేట్ పోలీస్ కౌన్సెలింగ్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్, కరోనా సమయంలో అనారోగ్యంతో ప్రయాణించవద్దు– వ్యాప్తికి కారణం కావద్దనే ప్రచారం, ఓటు నమోదు, ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం, ఆత్మహత్యల నివారణ కోసం అవగాహన కార్యక్రమం నిర్వహిస్తూ... ‘మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. నిలబెట్టుకోవడం, కాలరాసుకోవడం రెండూ మన నిర్ణయాల మీదనే ఉంటాయ’ని చెప్పేదాన్ని. గణేశ్ ఉత్సవాల సమయంలో మహిళలను తాకుతూ విసిగించడం, మెడల్లో దండలు అపహరించే పోకిరీల మీద ప్రత్యేక దృష్టి పెట్టింది మా డి΄ార్ట్‌మెంట్. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఆకతాయిల భరతం పట్టడం చాలా సంతోషాన్నిచ్చింది. సరదాకొద్దీ సోలో రైడ్లుచిన్నప్పటి నుంచి టామ్‌బాయ్‌లా పెరిగాను. బైక్ అంటే నా దృష్టిలో డ్యూటీ చేయడానికి ఉపకరించే వాహనం కాదు. బైక్ కిక్ కొట్టానంటే ప్రపంచాన్ని చుట్టేసి రావాలన్నంత ఉత్సాహం వస్తుంది. లధాక్‌లోని లేహ్ జిల్లాలో మాగ్నెటిక్ హిల్స్‌కి రైడ్ చేశాను. ఇప్పుడు నేను వాడుతున్న బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650. ఈ వాహనం కొనుగోలు చేసిన తొలి మహిళా పోలీస్‌గా నా పేరు రికార్డయింది. ‘వరల్డ్ మోటార్‌సైకిల్ డే’ సందర్భంగా బైక్ రైడ్ చేశాను. బైకర్లీగ్ విజేతను కూడా. ‘ఉమన్ సేఫ్ రైడర్ ఇన్ తెలంగాణ’ పురస్కారం కూడా అందుకున్నాను. అడ్వెంచరస్ స్పోర్ట్స్ అంటే ఇష్టం.గుర్గావ్లో ΄ారాషూట్ డైవింగ్, పారాగ్లైడింగ్ చేశాను. నా సాహసాలకు గాను సావిత్రిబాయి ఫూలే పురస్కారం, సోషల్ సర్వీస్‌కు గాను హోలీ స్పిరిట్ క్రిస్టియన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ అందుకోవడం అత్యంత సంతృప్తినిచ్చిన సందర్భాలు. మొత్తం నాలుగు మెడల్స్, మూడు అవార్డులు అందుకున్నాను.పాన్ ఇండియా మాస్టర్స్ గేమ్స్ ఫెడరేషన్ ఈ ఏడాది మే నెలలో నిర్వహించిన ఆటల పోటీల్లో షాట్‌పుట్, డిస్కస్ త్రోలో పతకాలందుకున్నాను. దానికి కొనసాగింపుగానే ప్రస్తుతం యూఎస్‌లో జరిగే క్రీడలకు ఆహ్వానం అందింది. వీసా కూడా వచ్చింది. నా దగ్గరున్న డబ్బు ఖర్చయి పోయింది. యూఎస్ వెళ్లిరావడానికి స్పాన్సర్షిప్ కోసం ఎదురు చూస్తున్నాను. ప్రపంచంలోని 50 దేశాల క్రీడాకారులు ΄ాల్గొనే ఈ పోటీలకు వెళ్లగలిగితే మాత్రం భారత్‌కు విజేతగా పతకాలతో తిరిగి వస్తాను’’ అన్నారు శ్యామల మెండైన ఆత్మవిశ్వాసంతో. – వాకా మంజులారెడ్డి, ఫొటోలు : మోర్ల అనిల్ కుమార్చ్ఠ్బైక్ కిక్ కొట్టానంటే ప్రపంచాన్ని చుట్టేసి రావాలన్నంత ఉత్సాహం వస్తుంది. లధాక్‌లోని లేహ్ జిల్లాలో మాగ్నెటిక్ హిల్స్‌కి రైడ్ చేశాను. ఇప్పుడు నేను వాడుతున్న బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650. ఈ వాహనం కొనుగోలు చేసిన తొలి మహిళా పోలీస్‌గా నా పేరు రికార్డయింది. -
పాము కాటుతో మహిళా పోలీసు మృతి
శ్రీకాకుళం: మండలంలోని తర్లిపేట సచివాలయంలో మహిళా సంరక్షణ కార్యదర్శి (మహిళా పోలీస్)గా పనిచేస్తున్న తామాడ జ్యోతికుమారి (36) పాముకాటుతో మృతిచెందారు. సంత»ొ మ్మాళి మండలం కాపుగోదాయవలస గ్రామానికి చెందిన తామాడ జ్యోతికుమారి తన తండ్రి రిటైర్డ్ వీఆర్ఓ తామాడ రామారావు ఇంటిలో ఉంటున్నారు. శుక్రవారం బాత్రూమ్ నుంచి బయటకు వ స్తుండగా పాము కాటు వేసింది. వెంటనే కు టుంబ సభ్యులు ఆమెను ఆటోపై కోట»ొ మ్మాళి సామాజిక ఆస్పత్రికి తరలిస్తుండగా జ్యోతికుమారి మార్గం మధ్యలోనే మృతి చెందారు. ఆమెకు భర్త జయరాజ్, కుమారుడు రఘునాథ్ ఉన్నారు. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆమె మృతిపై తర్లిపేట సచివాలయ సిబ్బంది వి.రమే‹Ù, డి.అప్పన్న, ఎం.మాధురి, టి.రాము, వై.సింహాద్రి, హెచ్.మహందాత, బి.భాను తన ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. -
సీఎం బందోబస్తులో మహిళా పోలీసుల ఇక్కట్లు
ఏలూరు (పశ్చిమ గోదావరి) : ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు బందోబస్తు నిర్వహిస్తున్న మహిళా ఏఎస్సై, కానిస్టేబుల్లు వడదెబ్బకు గురై స్పృహ తప్పి పడిపోయారు. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో శనివారం చోటుచేసుకుంది. జిల్లాలో నేడు ముఖ్యమంత్రి పర్యటన ఉండటంతో మహిళా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఏఎస్సై విజయలక్ష్మితో పాటు మరో మహిళా కానిస్టేబుల్ వడదెబ్బకు గురయ్యారు. ఇది గుర్తించిన తోటి పోలీసులు వారిని ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
బడుగులకు చిత్తశుద్ధితో సేవలందించాలి
మహిళ పోలీసులకు హోంమంత్రి నాయిని పిలుపు సాక్షి, హైదరాబాద్: ప్రజా సమస్యల పరిష్కారానికి నీతి నిజాయితీతో పని చేయాలని, పేద, బలహీనవర్గాలకు చిత్తశుద్ధితో సేవలందించాలని మహిళాపోలీసులకు తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పిలుపు నిచ్చారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండల పరిధిలోని అప్పా పోలీస్ అకాడమీలో 486 మంది మహిళా సివిల్, ఏఆర్ కానిస్టేబుల్ల పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ పోలీసు శాఖ ఆధునీకరణకు ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. శాంతిభద్రతలు సక్రమంగా ఉన్నప్పుడే రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. డీజీపీ అనురాగ్‌శర్మ మాట్లాడుతూ తెలంగాణ పోలీసుశాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించటంతో ప్రతిష్ట పెరిగిందన్నారు. పోలీస్ అకాడమీ డెరైక్టర్ డాక్టర్ మాలకొండయ్య మాట్లాడు తూ 1986లో స్థాపించిన అకాడమీలో ఇప్పటివరకు 2865 బ్యాచ్‌ల ద్వారా లక్షారెండు వేల మందికి శిక్షణ ఇచ్చామన్నారు. 16 బృందాలుగా ఏర్పడిన పాసింగ్ అవుట్ పరేడ్‌కు కమాండర్‌గా ఆర్.కీర్తి వ్యవహరించారు. ఈ సందర్భంగా వారు ప్రదర్శించిన కవాతు, బ్యాండ్ అందరినీ అలరించా యి. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నాగజ్యోతి ఆల్‌రౌండర్‌గా నిలవగా వరంగల్‌లో శిక్షణపొందినవారిలో ఆల్‌రౌండర్‌గా రంగారెడ్డి జిల్లాకు చెందిన కె. మంజుల నిలిచారు. ఇండోర్ విభాగంలో బి.సంధ్య, ఖాజా ఉన్నీసాబేగం, బెస్ట్ ఫైరింగ్‌లో వై.రేణుక, జి.రాజేశ్వరి, బెస్ట్ ఇం డోర్, అవుట్ డోర్ విభాగంలో రాధికలు నిల వగా వారికి నాయిని పతకాలను అందజేశారు.