బెంగళూరు: శ్రీరంగపట్నంలోని ఓ ఆలయంలో ఎస్‌ఐ-ఎమ్మెల్యే కుమార్తె మధ్య వివాదం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. తుమకూరు రూరల్ ఎమ్మెల్యే సురేష్ గౌడ కుమార్తె ఐశ్వర్య.. హారతి ఉక్కడ ఆలయంలో ఎస్‌ఐ సవితా బి. పాటిల్‌తో వాగ్వాదానికి దిగినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఐశ్వర్య ఫోన్ కాల్ చేస్తున్నట్లు కూడా వీడియోలో రికార్డయ్యింది.
ఇరువురు మధ్య వాగ్వాదం కొనసాగుతుండగా.. ఆమె ఆ పోలీసు అధికారిని చెంపదెబ్బ కొట్టింది. దాంతో ఆ అధికారి తిరిగి ఆమెను కొట్టారు. వారిని శాంతింపజేయడానికి భక్తులు కూడా ప్రయత్నించారు. ఆగస్టు 12న రాత్రి 8.15 గంటలకు భీమ అమావాస్య వేడుకల సమయంలో ఈ ఘటన జరిగింది. ఆలయ గర్భగుడిలోకి ప్రవేశం విషయమై ఈ వివాదం జరిగినట్లు సమాచారం.
మండ్య మహిళా పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ సవితా పాటిల్ ఈ ఘటనపై క్యాతనహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ప్రతి ఫిర్యాదును పోలీసులు స్వీకరించలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దర్శనం కోసం ఆలయానికి వచ్చిన ఐశ్వర్యను వెంటనే లోపలికి అనుమతించకపోవడంతో ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె పోలీసు అధికారిని దూషించి.. చెంపదెబ్బ కొట్టి, విధులకు ఆటంకం కలిగించినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై క్షమాపణలు చెప్పిన ఎమ్మెల్యే సురేష్ గౌడ.. ఆ పోలీసు అధికారి కూడా తన కుమార్తెను దూషించారన్నారు.
ఇదీ చదవండి: బిచ్చగత్తె కన్నుమూత : 30కి పైగా గోనె సంచుల్లో డబ్బు
Karnataka: A lady cop was allegedly slapped by a Karnataka MLA’s daughter during a dispute over special darshan at a temple.
The cop reportedly slapped her back in response. 😳 pic.twitter.com/3tlqk5HYdm— Ghar Ke Kalesh (@gharkekalesh) August 24, 2026
"తన కుమార్తె.. ఆలయ గర్భగుడిని దర్శించుకోవాలని కోరిందని.. అందుకు పోలీసులు తన కుమార్తెను లోపలికి అనుమతించలేదన్నారు. లోపలికి అనుమతించాలని తన కుమార్తె మళ్లీ అభ్యర్థించిందని.. ఆ తర్వాత ఆ పోలీసు అధికారి తన కుమార్తెను దూషించినట్లు తెలుస్తోందన్నారు. ఆ తర్వాత గొడవ ప్రారంభమైంది. నా కుమార్తె ఆ అధికారిని చెంపదెబ్బ కొట్టిన వీడియోను నేను చూడలేదు. నేను క్షమాపణలు కోరుతున్నానని ఎమ్మెల్యే గౌడ అన్నారు.


