breaking news
mla daughter
-
ఎస్ఐని కొట్టిన ఎమ్మెల్యే కుమార్తె.. ఆ రోజు అసలేం జరిగింది?
బెంగళూరు: శ్రీరంగపట్నంలోని ఓ ఆలయంలో ఎస్ఐ-ఎమ్మెల్యే కుమార్తె మధ్య వివాదం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. తుమకూరు రూరల్ ఎమ్మెల్యే సురేష్ గౌడ కుమార్తె ఐశ్వర్య.. హారతి ఉక్కడ ఆలయంలో ఎస్ఐ సవితా బి. పాటిల్‌తో వాగ్వాదానికి దిగినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఐశ్వర్య ఫోన్ కాల్ చేస్తున్నట్లు కూడా వీడియోలో రికార్డయ్యింది.ఇరువురు మధ్య వాగ్వాదం కొనసాగుతుండగా.. ఆమె ఆ పోలీసు అధికారిని చెంపదెబ్బ కొట్టింది. దాంతో ఆ అధికారి తిరిగి ఆమెను కొట్టారు. వారిని శాంతింపజేయడానికి భక్తులు కూడా ప్రయత్నించారు. ఆగస్టు 12న రాత్రి 8.15 గంటలకు భీమ అమావాస్య వేడుకల సమయంలో ఈ ఘటన జరిగింది. ఆలయ గర్భగుడిలోకి ప్రవేశం విషయమై ఈ వివాదం జరిగినట్లు సమాచారం.మండ్య మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ సవితా పాటిల్ ఈ ఘటనపై క్యాతనహళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ప్రతి ఫిర్యాదును పోలీసులు స్వీకరించలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దర్శనం కోసం ఆలయానికి వచ్చిన ఐశ్వర్యను వెంటనే లోపలికి అనుమతించకపోవడంతో ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె పోలీసు అధికారిని దూషించి.. చెంపదెబ్బ కొట్టి, విధులకు ఆటంకం కలిగించినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై క్షమాపణలు చెప్పిన ఎమ్మెల్యే సురేష్ గౌడ.. ఆ పోలీసు అధికారి కూడా తన కుమార్తెను దూషించారన్నారు.ఇదీ చదవండి: బిచ్చగత్తె కన్నుమూత : 30కి పైగా గోనె సంచుల్లో డబ్బుKarnataka: A lady cop was allegedly slapped by a Karnataka MLA’s daughter during a dispute over special darshan at a temple. The cop reportedly slapped her back in response. 😳 pic.twitter.com/3tlqk5HYdm— Ghar Ke Kalesh (@gharkekalesh) August 24, 2026"తన కుమార్తె.. ఆలయ గర్భగుడిని దర్శించుకోవాలని కోరిందని.. అందుకు పోలీసులు తన కుమార్తెను లోపలికి అనుమతించలేదన్నారు. లోపలికి అనుమతించాలని తన కుమార్తె మళ్లీ అభ్యర్థించిందని.. ఆ తర్వాత ఆ పోలీసు అధికారి తన కుమార్తెను దూషించినట్లు తెలుస్తోందన్నారు. ఆ తర్వాత గొడవ ప్రారంభమైంది. నా కుమార్తె ఆ అధికారిని చెంపదెబ్బ కొట్టిన వీడియోను నేను చూడలేదు. నేను క్షమాపణలు కోరుతున్నానని ఎమ్మెల్యే గౌడ అన్నారు. -
ఇష్టపడే పెళ్లి చేసుకున్నా : ఎమ్మెల్యే కుమార్తె
సాక్షి, కర్ణాటక(యలహంక) : దావణగెరె జిల్లా మాయకొండ ఎమ్మెల్యే శివమూర్తి నాయక్ కుమార్తె లక్ష్మి, కన్నడ మాస్తిగుడి సినిమా నిర్మాత సుందర్‌గౌడ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. తన ఇష్ట ప్రకారమే నిర్మాత సుందర్గౌడను పెళ్లి చేసుకున్నానని, ఇందులో ఎవరి బలవంతము లేదని లక్ష్మి పేర్కొన్నారు. ఎమ్మెల్యే శివమూర్తి నాయక్ తన కుమార్తె కనిపించక పోవడంతో బెంగళూరులోని యలహంక ఉపనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నవ దంపతులను కన్నడ హీరో దునియా విజయ్ స్వయంగా తన వాహనంలో యలహంక పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి సీఐ మంజునాథ్ ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా సీఐ ఆమెను విచారణ చేశారు. తన ఇష్ట ప్రకారమే తాను సుందర్ గౌడను పెళ్లి చేసుకున్నానని చెప్పారు. తల్లి, అవ్వ కన్నీటి పర్యంతం ప్రేమ పెళ్లి చేసుకున్న నవ దంపతులు పోలీస్ స్టేషన్‌కు వస్తున్నారన్న విషయం తెలుసుకున్న లక్ష్మి నాయక్ తల్లి గీతా, అవ్వ లక్ష్మి బాయి సహా పది మందికి పైగా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. తన కుమార్తె లక్ష్మిని చూడగానే తల్లి, అవ్వ రోదిస్తూ ఇంటికి వెళ్దాం రామ్మా అంటూ బతిమిలాడినా లక్ష్మి మౌనంగానే ఉండిపోయింది. దీంతో వృద్ధురాలు అయిన లక్ష్మిబాయి కొద్ది సేపటికే స్పృహ తప్పిపడిపోయింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. -
ఎమ్మెల్యే కూతురు.. సినీ నిర్మాత
సాక్షి, మైసూరు: మైసూరులో ఓ ప్రేమ పెళ్లి సస్పెన్స్ రేపింది. దావణగెరె జిల్లా మాయకొండ ఎమ్మెల్యే శివమూర్తి నాయక్ కుమార్తె లక్ష్మి, కన్నడ మాస్తిగుడి సినిమా నిర్మాత పి.సుందర్‌గౌడ ఇద్దరు సినిమా రీతిలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. మైసూరు చాముండి కొండపై గురువారం తెల్లవారుజామున మూడుముళ్లతో ఒక్కటయ్యారు. వరుని బంధువులు మాత్రమే ఈ పెళ్ళిలో పాల్గొన్నారు. వీరందరూ బుధవారం సాయంత్రమే మైసూరు నగరంలో ఉన్న హోటల్లో దిగారు. తెల్ల వారుజామున గుట్టుగా చాముండి కొండకు చేరుకుని పెళ్లి కార్యక్రమం ముగించారు. రంగంలోకి బెంగళూరు పోలీసులు బుధవారం ఎమ్మెల్యే శివముర్తి నాయక్ తన కుమార్తె కనిపించడం లేదని బెంగళూరులోని యలహంక ఉపనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి కుటుంబం అక్కడే ఉంటోంది. ఉదయమే పోలీసులు మైసూరులో హోటల్ వద్దకు వచ్చి సీసీ కెమెరా చిత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బంధువులు కొండపై నుంచే కొత్త జంటను ఎటో పంపించేసి హోటల్ వద్దకు చేరుకున్నారు. బంధువులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. హోటల్ యజమాని మాట్లాడుతూ.. బుధవారం సాయంత్రం నిర్మాత బంధువులు వచ్చి నాలుగు గదులను బాడుగకు తీసుకొన్నారని, ఉదయమే అందరూ కలిసి చాముండి కొండకు వెళ్లారని చెప్పారు. బెంగళూరు నుంచి సుమారు 40 మందికి పైగా పోలీసులు ఇక్కడికి చేరుకోని బంధువులను విచారణ చేస్తున్నారని తెలిపారు. మరోపక్క వధూవరుడు రహస్యంగా బెంగళూరు వైపు వెళ్ళినట్లు తెలుస్తోంది. ఫిర్యాదు దాఖలైన పీఎస్‌కు వెళ్లి తమది ఇష్టపూర్వక వివాహమేనని ప్రకటించనున్నారు. తన ఇష్టం ప్రకారమే పెళ్ళి సెల్ఫీ వీడియో పంపిన వధువు వధూవరులు లక్ష్మి– సుందర్‌లు ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పెళ్లికూతురు మాట్లాడుతూ.. తాను– సుందర్‌గౌడ ఇద్దరం ప్రేమించుకొని పెళ్ళి చేసుకున్నామని తెలిపారు. ఈ పెళ్ళి తన ఇష్ట ప్రకారమే జరిగిందని, ఎవరూ ఎలాంటి ఒత్తిడి చేయలేదని, మా వల్ల ఎవరికి ఇబ్బంది కలిగించ వద్దని వేడుకున్నారు. వీరిద్దరి మధ్య సుమారు ఆరునెలల నుంచి ప్రేమాయణం సాగుతోందని తెలుస్తోంది. -
మంత్రి పదవి కోసం పూజలు


