బెంగళూరు: మహిళా ఎస్‌ఐ, జైలులో ఖైదీతో అర్దనగ్నంగా వీడియో కాల్‌లో మాట్లాడడం అసెంబ్లీలో చర్చకు వచ్చింది. సోమవారం శాసనసభలో హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే మాట్లాడారు. ఈ వీడియో ఏడాది కిందటిదని, ఆమెకు నోటీస్ ఇచ్చి బదిలీ చేశామన్నారు. ఆమె ఇలా చేయడాన్ని సమర్థించడం లేదన్నారు. పోలీసులే ఇలాంటి పనులు చేస్తుంటే ఎలా?, పోలీస్ శాఖకు చెడ్డపేరు తెచ్చారు అని వాపోయారు.
ఓ మహిళా ఎస్‌ఐ.. బెళగావి సెంట్రల్ జైల్లోని ఖైదీతో ప్రేమలో పడింది. అతనికి యూనిఫారంలోనే వాట్సాప్ కాల్ చేసి అర్ధనగ్నంగా కనిపించింది. ఖైదీ ఆ వీడియోను ఇతరులకు పంపడంతో వైరల్ అయ్యింది. ఆ ఎస్‌ఐ దీనిపై వారం కిందట బెంగళూరు కబ్బన్‌పార్క్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. ఈ బాగోతం వైరల్ అయ్యింది.


