breaking news
homeminister
-
కన్నడ సూపర్ స్టార్‌తో...
‘అప్పట్లో ఒకడుండేవాడు, పటేల్ సార్’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు తాన్యా హోప్. లేటెస్ట్గా కన్నడ ఇండస్ట్రీకు కూడా పరిచయం కాబోతున్నారీ మంగళూర్ భామ. అది కూడా మామూలు ఎంట్రీ కాదు కన్నడ టాప్ స్టార్ ఉపేంద్ర నటిస్తోన్న ‘హోమ్ మినిస్టర్’ సినిమా ద్వారా. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా కనిపిస్తారు తాన్య. కన్నడ డెబ్యూ గురించి తాన్య మాట్లాడుతూ – ‘‘నేను సౌత్ ఇండియన్ అమ్మాయిని కాబట్టి సౌత్ లాంగ్వేజెస్‌లో కంఫర్టబుల్‌గా ఉండగలుగుతున్నాను. ‘హోమ్ మినిస్టర్’ సినిమాలో నేనో ఇండిపెండెంట్ అమ్మాయిగా కనిపిస్తాను. ఉపేంద్రగారి సినిమాలు చాలా సంవత్సరాలుగా ఫాలో అవుతున్నాను. అలాంటి సూపర్ స్టార్ పక్కన నటించటం చాలా ఎగై్జటింగ్‌గా అనిపించింది. షూటింగ్ మొదట్లో చాలా నెర్వస్‌గా ఫీల్ అయ్యాను కానీ ఉపేంద్ర గారు నన్ను చాలా కంఫర్ట్‌బుల్‌గా ఫీల్ అయ్యేలా చూసుకున్నారు. నా డైలాగ్స్ విషయంలో కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. ఆయన చాలా మంచి వ్యక్తి’’ అన్నారు. -
6 జిల్లాల్లో కరువు- హోంమంత్రి
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌లో 6 జిల్లాల్లో కరువు విలయతాండవం చేస్తోందని ఆ రాష్ట్ర హోంమంత్రి చిన్నరాజప్ప తెలిపారు. కరువు నివారణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు. నెల్లూరు కలెక్టరేట్లో గురువారం వివిధ శాఖల అధికారులతో ఆయన సమావేశమై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 2.98 లక్షల హెక్టార్లలో పంటలు వేయాల్సి ఉండగా ఈసారి 98 వేల హెక్టార్లలో మాత్రమే పంటలు వేశారన్నారు. వర్షాభావం వల్ల భూగర్భ జలాలు ఎండిపోయి పరిస్థితి జటిలంగా మారిందన్నారు. రైతులకు సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు సరఫరా చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో కలెక్టర్ ఎం. జానకి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.