ఢిల్లీ: కావేరీ నదీ జలాల పంపిణీ వివాదంలో తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కర్ణాటక నుంచి అదనంగా 11 టీఎంసీల నీటిని విడుదల చేయించాలంటూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
కావేరీ జలాల వాటాలో తమకు రావాల్సిన నీటిని కర్ణాటక విడుదల చేయడం లేదని తమిళనాడు ప్రభుత్వం ఆరోపించింది. ఆగస్టులో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ, కేటాయించిన నీటిని సకాలంలో విడుదల చేయలేదని పేర్కొంది. అక్టోబర్ 7 నాటికి సుమారు 11 టీఎంసీల నీటి కొరత ఉందని, ఈ లోటును భర్తీ చేసేందుకు బిల్లిగుండ్లు వద్ద రోజుకు 1.3 టీఎంసీల చొప్పున పది రోజుల్లో నీటిని విడుదల చేయాలని కోరింది.
మరోవైపు కర్ణాటక ప్రభుత్వం ఈ వాదనలను వ్యతిరేకించింది. తమ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ వర్షాభావం, కరువు పరిస్థితులు ఉన్నాయని, నీటి విడుదల విషయంలో కావేరీ జల నిర్వహణ సంస్థ ఆదేశాలను పాటిస్తున్నామని కోర్టుకు తెలిపింది. ఇరువైపుల వాదనలు పరిశీలించిన సుప్రీంకోర్టు తమిళనాడు పిటిషన్లను కొట్టివేసింది. అదనపు పత్రాలను సమర్పించేందుకు తమిళనాడు దాఖలు చేసిన మరో దరఖాస్తును కూడా తిరస్కరించింది.
Supreme Court declines Tamil Nadu’s plea seeking a direction to Karnataka to release 11 TMC of Cauvery water to meet the alleged shortfall https://t.co/M4jXvKLilR
— ANI (@ANI) November 20, 2026
ఇదీ చదవండి: భారత్ సైడ్ ప్లేయర్.. పాక్‌తో పోలుస్తూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు


