వాషింగ్టన్: అమెరికాలోని చికాగో యూనివర్సిటీలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. అంతర్జాతీయ దౌత్య వ్యవహారాల్లో భారత్ ప్రభావం తగ్గుతోందని, ప్రపంచ పరిణామాల్లో కీలక పాత్ర పోషించకుండా ‘సైడ్ ప్లేయర్’గా మిగిలిపోతోందని ఆయన వ్యాఖ్యానించారు. పాకిస్థాన్, అమెరికా, ఇరాన్‌లతో చర్చలు జరుపుతుంటే భారత్ మాత్రం కీలక అంతర్జాతీయ చర్చల్లో భాగం కావడం లేదని అభిప్రాయపడ్డారు.
చికాగో యూనివర్సిటీలో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ.. గతంలో భారత్‌కు ఇతర దేశాలతో వ్యూహాత్మక సంబంధాలు ఉన్నప్పటికీ, అంతర్జాతీయ అంశాలపై సొంత అభిప్రాయం, స్వతంత్ర విధానం ఉండేదన్నారు. దేశ జనాభా, ప్రాధాన్యత దృష్ట్యా ప్రపంచ వ్యవహారాల్లో భారత్ క్రియాశీల పాత్ర పోషించాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ తరచూ ప్రపంచ నేతలతో తన స్నేహాన్ని ప్రస్తావించడంపైనా స్పందిస్తూ.. అంతర్జాతీయ రాజకీయాలు వ్యక్తిగత స్నేహాల ఆధారంగా నడవవని వ్యాఖ్యానించారు.
🚨 RAHUL GANDHI ON INDIA-PAKISTAN TALKS: "THE MOMENT THAT STOPS, A CONVERSATION CAN POTENTIALLY BEGIN" During an interaction with students at the University of Chicago in Illinois, US, Lok Sabha Leader of Opposition Rahul Gandhi was asked whether India and Pakistan could move beyond mutual accusations and work together. Responding to a participant who identified himself as a Pakistani national, Gandhi said there was scope for dialogue but Pakistan's support for and promotion of terrorism in India remained the biggest obstacle. He said India could not accept a situation where innocent citizens continued to be killed while talks with Pakistan were underway. 🎥 #RahulGandhi #IndiaPakistan https://t.co/cSlapG0Tl8
— contentkikamii (@contentkikamii) November 20, 2026
అలాగే, పాకిస్థాన్‌తో చర్చల అంశంపైనా రాహుల్ స్పష్టత ఇచ్చారు. భారత్‌తో కలిసి పనిచేసే అవకాశం ఉన్నప్పటికీ, ఉగ్రవాదానికి పాకిస్థాన్ మద్దతు ఇవ్వడం ప్రధాన అడ్డంకి అని చెప్పారు. అమాయకుల ప్రాణాలు పోతున్నప్పుడు చర్చలు జరపడం సాధ్యం కాదని, ఉగ్రవాదానికి మద్దతు ఆగినప్పుడే చర్చలకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ఇజ్రాయెల్‌తో భారత్ మంచి సంబంధాలు కొనసాగించాలని, రక్షణ రంగంలో సహకారం కూడా ఉండాలని రాహుల్ అన్నారు. అయితే విదేశాంగ విధానం ఇతర దేశాల ప్రయోజనాల ఆధారంగా కాకుండా, భారత ప్రయోజనాలకే ప్రాధాన్యతనిస్తూ ఉండాలని చెప్పారు. హమాస్ 2023 అక్టోబర్ 7న జరిపిన దాడులను ఖండించిన ఆయన.. గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యలను కూడా విమర్శించారు.
రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడి
రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. భారత్ అంతర్జాతీయ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆయన మాట్లాడుతున్నారని పార్టీ అధికార ప్రతినిధి సీఆర్ కేసవన్ విమర్శించారు. ప్రపంచ వేదికలపై రాహుల్ పాకిస్థాన్‌కు మద్దతుదారుడిలా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేత ప్రదీప్ భండారీ ఆరోపించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ అంతర్జాతీయంగా కీలక పాత్ర పోషిస్తోందని, ప్రపంచ దేశాల మధ్య ఏకాభిప్రాయం సాధించడంలోనూ ముందుందని బీజేపీ నేతలు పేర్కొన్నారు. ఇలా చికాగో వేదికగా రాహుల్ గాంధీ చేసిన విదేశాంగ విధాన వ్యాఖ్యలు కాంగ్రెస్, బీజేపీ మధ్య మరో రాజకీయ విమర్శల యుద్ధానికి దారితీశాయి.
ఇదీ చదవండి: బీమా గడువు ముగిసిన వాహనాలకు జరిమానాలుండవు


