సాక్షి, అనంతపురం: తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి అరాచకాలు కొనసాగుతున్నాయి. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే వైఎస్సార్ సీపీ మద్దతుదారుల ఆస్తులను జేసీ వర్గీయులు ధ్వంసం చేస్తున్నారు. ఇగుడూరు వైఎస్సార్‌సీపీ నేత రంగారెడ్డికి చెందిన స్కార్పియో వాహనాన్ని జేసీ వర్గీయులు ధ్వంసం చేశారు. ఒక కారు, రెండు బైకులు ధ్వంసం చేశారు.
సజ్జలదిన్నె పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి బోయ రాజు స్కార్పియో వాహనానికి జేసీ వర్గీయులు నిప్పు పెట్టారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి అరాచకాలను చూసీచూడనట్లు తాడిపత్రి పోలీసులు వదిలేస్తున్నారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి అరాచకాలపై తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇగడూరు, సజ్జలదిన్నె బాధితులను మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పరామర్శించారు. జేసీ హింసా రాజకీయాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందని.. జేసీ అరాచకాలు పోలీసు అధికారులకు కనిపించవా?’’ అంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రశ్నించారు.
ఇదీ చదవండి: కూటమిలో ట్విస్ట్.. జనసేనకు టీడీపీ షాక్!


