బెంగళూరు: ఏపీకి చెందిన మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌పై కిడ్నాప్ కేసు నమోదైంది. బెంగళూరు బీజేపీ నేత డా. రవిప్రకాష్ కిడ్నాప్‌కు గురైన అంశానికి సంబంధించి పుట్టా సుధాకర్‌పై బెంగళూరు పీఎస్‌లో కేసు నమోదు చేశారు. తన భర్తను టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ కిడ్నాప్ చేయించారని ఫిర్యాదు చేశారు రవి ప్రకాశ్ భార్య. దాంతో పుట్టా సుధాకర్‌పై కేసు నమోదు చేశారు బెంగళూరు పోలీసులు.
నాలుగు వాహనాల్లో వచ్చి తన భర్త రవిప్రకాశ్‌ను పుట్టా సుధాకర్ అనుచరులు కిడ్నాప్ చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. బెంగళూరు రాజరాజేశ్వరినగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు బీజేపీ నేత రవిప్రకాష్ భార్య సబీనా. పుట్టా సుధాకర్‌తో పాటు ఆయన కుమారుడు రవి కుమార్‌పై కూడా ఆమె ఫిర్యాదు చేశారు.


