విశాఖపట్నం: ఏపీలో ఎక్కడ చూసినా అనిశ్చితి పరిస్థితే కనిపిస్తోందని, అసలు రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఉందా? అని ప్రశ్నించారు వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఒకవైపు రాష్ట్రంలో వర్షాలు పడటం లేదని, కరువు నెలకొందని, మరొకవైపు నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయని మండిపడ్డారు. ప్రస్తుతం మధ్యతరగతి ప్రజల పరిస్థితి చాలా దుర్భరంగా ఉన్నా, కూటమి పాలకులు చీమ కుట్టినట్లు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈరోజు(ఆదివారం) విశాఖపట్నం నుంచి మీడియాతో మాట్లాడిన బొత్స.. రాష్ట్రంలో తీవ్రమైన సంక్షోభం ఉంటే, కూటమి ప్రభుత్వం మాత్రం వ్యక్తిగత ఆరోపణలతోనే కాలక్షేపం చేస్తుందని ధ్వజమెత్తారు.
‘రాష్ట్రంలో వర్షాలు పడటం లేదు.. కరువు నెలకొంది, రోజుకు 10 సార్లు కరెంట్‌పోతుంది. విద్యుత్ సమస్యపై ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదు. డీఎస్సీలో పరీక్షలు రాయకుండానే ఉద్యోగాలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం డీఎస్సీ ఉద్యోగాలు అమ్ముకుంది. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి.
జీవోలు ఇవ్వడం.. రద్దు చేయడం ఏంటి?, గ్యాస్ రూ. 937.. మధ్య తరగతి ప్రజలు ఎలా బ్రతకాలి?, అన్నపూర్ణ లాంటి ఏపీలో కిలో బియ్యం రూ. 70 ఉందిరాష్ట్రంలో చంద్రబాబులా అందరూ డబ్బులొన్న వాళ్లు ఉండరు. ధరలు పెరిగినట్లు తలసరి ఆదాయం పెరుగుతుందా?, పంచదార కేజీ రూ. 75 ఎలా కొనాలి?, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగితే ప్రజలు ఎలా బతకాలి. రాష్ట్రంలో క్రైం పెరిగింది. హత్యలు, అత్యాచారాలు, గంజాయి ఇవే రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో వర్షాలు పడటం లేదు, కరువు నెలకొంది. పబ్లిక్ మీటింగ్‌ల్లో చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. టైం పాస్ చేయడానికి చంద్రబాబు అరకు రావాలా?, అసలు రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఉందా?’ అని ప్రశ్నించారు బొత్స.
ఇదీ చదవండి:
కూటమి సర్కార్‌కు జోగి రమేష్ సవాల్


