మేఘాలయలో భారీ ఎన్‌కౌంటర్‌.. నలుగురు హతం | Major encounter in Meghalaya | Sakshi
Sakshi News home page

మేఘాలయలో భారీ ఎన్‌కౌంటర్‌.. నలుగురు హతం

Aug 30 2026 7:41 PM | Updated on Aug 30 2026 7:45 PM

Major encounter in Meghalaya

షిల్లాంగ్‌: మేఘాలయాలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. తూర్పు గారోహిల్స్ జిల్లాలోని సోంగ్‌సాక్ సమీపంలో పోలీసులకు అంతర్రాష్ట్ర నేర ముఠాకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు నేరస్థులు హతమయ్యారు. ఈ వివరాలను పోలీసులు ప్రకటించారు.

ప్రాథమిక నివేదికల ప్రకారం, సాంగ్సాక్ ప్రాంతంలో పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్న సమయం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.  ఆపరేషన్ సమయంలో అనుమానిత ముఠా సభ్యులు పోలీసులపై కాల్పులు జరపడంతో, సిబ్బంది ఎదురు కాల్పులు జరిపినట్లు సమాచారం.

మృతుల వివరాలు.. మేఘాలయకు చెందిన అలచోన్ మారక్ , అగియాకు చెందిన కలం షేక్, కృష్ణాయికి చెందిన భాబిదుల్ ఇస్లాం ,సుస్తమ్ రభాగా అధికారులు గుర్తించారు. ఈ పోలీసు ఆపరేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement