యూపీలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి రాజీనామా కలకలం | Senior IAS Officer Divya Mittal Steps Down After 13 Years Of Service Pens Heartfelt Note | Sakshi
Sakshi News home page

యూపీలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి రాజీనామా కలకలం

Aug 30 2026 2:28 PM | Updated on Aug 30 2026 2:38 PM

Senior IAS Officer Divya Mittal Steps Down After 13 Years Of Service Pens Heartfelt Note

సాక్షి, లక్నో :  ఉత్తర్ ప్రదేశ్ కేడర్‌కు చెందిన 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి దివ్య మిట్టల్ తీసుకున్న సంచలన నిర్ణయం నెట్టింట వైరల్‌గా మారింది. యూపీ రెవెన్యూ శాఖలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న దివ్య మిట్టల్, 13 ఏళ్ల సుదీర్ఘ కరియర్‌కు రాజీనామా చేశారు. సోషల్ మీడియా ద్వారా తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ, ప్రజా సేవలో గడిపిన తన సంవత్సరాలను ఒక మరపురాని అధ్యాయంగా మిట్టల్ అభివర్ణించారు.

ఐఏఎస్‌లో 13 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌ను ముగిస్తూ, మిట్టల్ తన దృష్టిలో, అధికారిక పదవిని వదిలివేయడం అంటే, తనను భారతదేశానికి తిరిగి తీసుకువచ్చిన ఉన్నతమైన లక్ష్యాన్ని విడిచిపెట్టడం కాదని వ్యాఖ్యానించారు.  తాను ఈ పదవిని వీడుతున్నప్పటికీ, సేవ వైపు తనను ఆకర్షించిన గొప్ప కల మాత్రం కొనసాగుతుందని ఆమె అన్నారు. అదే విధంగా  ప్రజా సేవపై తన మారుతున్న అవగాహన గురించి, తన వృత్తి జీవితంలో తాను కనుగొన్న ఉద్దేశ్యం గురించి ప్రధానంగా ప్రస్తావించారు. ఒకప్పుడు తన కోసం తాను కన్న వ్యక్తిగత కలలు ఇప్పటికే నెరవేరాయని, ఇప్పుడు తాను ఇతరుల కోసం కన్న కలల కోసం జీవించాలను కుంటున్నానని మిట్టల్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

‘‘ఈ నేల నాకు విద్యను, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఆ రుణం తీర్చుకోవడానికే సివిల్ సర్వీసెస్‌లోకి వచ్చాను" అని భావోద్వేగంతో చెప్పుకొచ్చారు.  తాను ఒకప్పుడు విజయంగా భావించిన దానిని సాధించి నప్పటికీ, ఏదో అసంపూర్ణంగా మిగిలిపోయిందని అనిపించిందని ఆమె తన రాజీనామా లేఖలో గుర్తు చేసుకున్నారు. భారతదేశానికి దూరంగా జీవించడం తనను కలవరపెట్టిందనీ, అందుకే దేశానికి తిరిగి వచ్చి ఐఏఎస్‌లో చేరినట్టు చెప్పుకొచ్చారు.  లండన్‌లో ఉన్నతమైన కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి దేశసేవ కోసం భారత్ వచ్చినమిట్టల్‌ తాజా  రాజీనామా చర్చకు దారి తీసింది.  

 అలాగే కుటుంబాలు తొలిసారిగా భూమి హక్కులను పొందడం, దివ్యాంగులు గౌరవప్రదంగా జీవించే అవకాశాలను పొందడం, రైతులు తమ పొలాలకు నీటిని అందుకోవడం వంటివి చూడటమే ప్రజా సేవలో అత్యంత సంతృప్తి నిచ్చిన ఉదంతాలన్నారు. ప్రజలకు ఏదైనా ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే  ప్రజా సేవలోకి ప్రవేశించానని , అయితే, సంవత్సరాలు గడిచేకొద్దీ, వారి సంతోషం, ఆప్యాయత , నమ్మకం రూపంలో తాను వారి నుండి అంతకంటే ఎంతో ఎక్కువ పొందానంటే సంతోషాన్ని వెలిబుచ్చారు.  తన  పదవీ కాలంలో తనతో పాటు పనిచేసిన సహోద్యోగులకు, అధికారులకు ,ఉద్యోగులకు కూడా  ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తనకు లభించిన ప్రేమ,  మర్యాద,  ఆప్యాయత తనకు ఎంతో సంతృప్తినిచ్చాయని, కష్ట సమయాల్లో కూడా ముందుకు సాగడానికి అవి తోడ్పడ్డాయన్నారు.

లహూరియా దేహ్ గ్రామానికి మొదటిసారిగా నీరు రావడం చూసి, ఒక వృద్ధురాలు వణుకుతున్న చేతులతో తన తలను తాకడాన్ని మిట్టల్ గుర్తు చేసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ 75 ఏళ్ల నిరీక్షణ తర్వాత 125 కుటుంబాలకు పైపుల ద్వారా కుళాయి నీటిని అందించింది. తన వీడ్కోలు ప్రసంగంలో, పరిపాలన ,బాధ్యతపై తన అవగాహనను తీర్చిదిద్దడంలో ఈ రెండు పోస్టింగ్‌లే కీలకమని వ్యాఖ్యానించడం విశేషం. న్యాయమైన దాని పక్షాన నిలబడటం ఒక ఐచ్ఛికం కాదని, అది ఒక కర్తవ్యం అని డియోరియా తనకు నేర్పించిందనీ. "అసాధ్యం అనేది వాస్తవం కాదు, కేవలం ఒక అభిప్రాయం మాత్రమే" అని మీర్జాపూర్ తనకు నేర్పించిందన్నారు. అయితే లండన్‌లో ఉన్నతమైన కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి దేశసేవ కోసం భారత్ వచ్చినమిట్టల్‌ తాజా రాజీనామా చర్చకు దారి తీసింది. మరోఆణిముత్యం లాంటి ఆఫీసర్‌ను కోల్పోయాం అంటూ సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి

ఇదీ చదవండి: Nepal Flash Floods 1600 మందిని కాపాడిన ఒకే ఒక్కడు!

ఎవరీ దివ్య  మిట్టల్
ఢిల్లీకి చెందిన ఈమె ఐఐటీ ఢిల్లీనుంచి ఇంజినీరింగ్, ఐఐఎమ్ బెంగళూరు నుంచి మేనేజ్‌మెంట్ పూర్తి చేశారు. లండన్‌లో ఫైనాన్స్ విభాగంలో అధిక జీతంతో కూడిన ఉద్యోగం సాధించినప్పటికీ, దేశానికి సేవ చేయాలనే తపనతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి భారత్‌కు తిరిగొచ్చారు. UPSC సాధించి IAS అధికారిణిగా మారారు. అలా మిట్టల్ తన ఐఏఎస్ కెరీర్‌లో యూపీలోని మీర్జాపూర్ , సంత్ కబీర్ నగర్, జిల్లాల కలెక్టర్‌గా పనిచేశారు. అలాగే రెవెన్యూ శాఖలో స్పెషల్ సెక్రటరీగా సేవలు అందించారు. ముఖ్యంగా మీర్జాపూర్‌లోని 'లహురియా దిహ్' (Lahuriya Dih) కొండ ప్రాంత గ్రామానికి తొలిసారిగా తాగునీరు అందించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. మిట్టల్ మే నెలలో డియోరియా నుండి లక్నోకు రెవెన్యూ శాఖలో ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ అయ్యారు. ఆమె భర్త గగన్‌దీప్ సింగ్ కూడా ఐఏఎస్ అధికారి. ఐఐటి ఢిల్లీ, ఐఐఎం బెంగళూరు పూర్వ విద్యార్థి.

ఇదీ చదవండి: తుకారాం ముండేకు భారీ ఎదురు దెబ్బ, హైకోర్టు మండిపాటు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement