లక్నో: నేపాల్ నుంచి ప్రవహించే నదుల్లో ఏడు మృతదేహాలను భారత అధికారులు వెలికితీశారు. ఇవి మెరుపు వరదల్లో మృతి చెందినవారి మృతదేహాలు అయి ఉండొచ్చని అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ ఘటన ఘోర వరద విపత్తు తీవ్రతను తెలియజేస్తోంది.
నేపాల్ దక్షిణ ప్రాంతంలోని వరద ప్రభావిత చిత్వన్ ప్రాంతానికి సరిహద్దుగా ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహారాజ్‌గంజ్, కుషీనగర్ జిల్లాల్లో నదుల్లో ఈ మృతదేహాలు కొట్టుకొస్తూ కనిపించాయి.
“గుర్తుతెలియని నాలుగు మృతదేహాలను గురువారం జిల్లాలో వెలికితీశాం. అక్కడ సంభవించిన ఆకస్మిక వరదల తర్వాత అవి నేపాల్ నుంచి కొట్టుకొచ్చి భారత్‌లోకి ప్రవేశించి ఉంటాయని భావిస్తున్నాం” అని ” అని మహారాజ్‌గంజ్ జిల్లా మేజిస్ట్రేట్ గౌరవ్ సింగ్ సోగర్వాల్ ఏఎఫ్‌పీకి తెలిపారు.
సరిహద్దు నుంచి నదీ ప్రవాహ దిశలో సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుషీనగర్ జిల్లాలో మరో మూడు మృతదేహాలను వెలికితీశామని పోలీసు అధికారి తెలిపారు. మృతదేహాలను గుర్తించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
కాగా, నేపాల్ వరదల్లో 538 మంది మృతి చెందారు. ఇందులో నేపాల్‌లో వెలికితీసిన 469, చైనాలో 3 మృతదేహాలు ఉన్నాయి. దాదాపు 1,400 మంది ఆచూకీ తెలియడం లేదు. భారత్‌లో వెలికితీసిన ఏడు మృతదేహాలను ఈ మృతుల సంఖ్యలో చేర్చలేదు.
ఇదీ చదవండి: నార్వే రాజు హరాల్డ్-5 ఇకలేరు


