breaking news
Pavithra Gowda
-
'నా మనసుకు ఇంకా గాయం..' మహాకుంభమేళాలో పవిత్ర గౌడ
అభిమాని రేణుకాస్వామి హత్య కేసు నిందితులు హీరో దర్శన్ (Darshan), అతడి ప్రేయసి, నటి పవిత్రగౌడ (Pavithra Gowda) ఆలయాల బాటపట్టారు. దైవభక్తిలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. తాజాగా పవిత్రగౌడ మహాకుంభమేళాకు వెళ్లింది. మౌని అమావాస్య రోజు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆశీర్వాదం..ఎంతో పవిత్రమైన మౌని అమావాస్య రోజు మహాకుంభమేళా (Mahakumbh 2025)లో స్నానం ఆచరించడాన్ని ఆశీర్వాదంగా భావిస్తున్నాను. నెగెటివ్ ఎనర్జీ నుంచి నాకు స్వేచ్ఛ లభించిందని నమ్ముతున్నాను. హరహర మహాధేవ్ అని క్యాప్షన్ జోడించింది. ఒకరి కుటుంబాన్ని నాశనం చేసి నువ్వు మాత్రం స్వేచ్ఛగా తిరుగుతున్నావా? అంటూ నెటిజన్లు నటిని తిట్టిపోస్తూనే ఉన్నారు. దీంతో ఆమె మరో పోస్ట్ పెట్టింది.మరింత బాధ, శోకం..మతానికి, అన్యాయానికి జరిగిన సంఘర్షణలో మతమే గెలుస్తుంది. ఒకవేళ మొదట అన్యాయం విజయం సాధించినా చివరకు గెలిచేది మాత్రం మతమే! నన్ను తిడుతూ, నన్ను బాధపెడుతున్న న్యూస్ ఛానల్స్, సోషల్ మీడియా సైట్స్‌కు థాంక్స్. హద్దులు మీరుతూ మీరు చేస్తున్న కామెంట్లు నా మనసును మరింత బాధకు గురి చేస్తున్నాయి. ఇంకా శోకంలోకి నెట్టేస్తున్నాయి అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by 𝙋𝙖𝙫𝙞𝙩𝙝𝙧𝙖 𝙂𝙤𝙬𝙙𝙖 (@pavithragowda777_official) View this post on Instagram A post shared by 𝙋𝙖𝙫𝙞𝙩𝙝𝙧𝙖 𝙂𝙤𝙬𝙙𝙖 (@pavithragowda777_official)చదవండి: సన్యాసిగా మారిన హీరోయిన్‌పై బహిష్కరణ వేటు -
మా అమ్మ ఎవర్నీ గాయపర్చలేదు, ఈ భారం మోయలేకున్నా!: పవిత్ర కూతురు
అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్ (Darshan), అతడి ప్రియురాలు పవిత్ర గౌడ (Pavithra Gowda) కొన్ని నెలలపాటు జైలు జీవితం గడిపారు. కొద్ది రోజుల క్రితమే ఇద్దరూ బెయిల్‌పై బయటకు వచ్చారు. అయితే ఆ సంఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటికీ వీరిద్దరిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. దీనిపై పవిత్ర గౌడ కూతురు ఖుషి గౌడ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. ఇలాంటి పోస్ట్ ఒకటి పెట్టాల్సి వస్తుందని నేను ఎన్నడూ అనుకోలేదు. కానీ మీ మాటలు మా మనసుకు గాయం చేస్తున్నాయి. దాన్ని అలాగే వదిలేయలేకపోతున్నాను.మీకేం తెలుసు?అర్థం పర్థం లేకుండా, మీకు మీరే అన్నీ నిర్ధారించేసుకుంటూ మా అమ్మ గురించి క్రూరంగా మాట్లాడుతున్నారు. అవి నా మనసును ఎంత బాధిస్తున్నాయో మీకేం తెలుసు? తను పడ్డ కష్టాలు, చేసిన త్యాగాలు మీకు తెలియదు. మీ సూటిపోటి మాటలపై తను నిశ్శబ్ధంలోనే పోరాటం చేస్తోంది. తన చుట్టూ ఉన్న ప్రపంచం కుప్పకూలిపోతుంటే కూడా ధైర్యంగా నిలబడింది. మా అమ్మే నా ప్రపంచం, బలం, ఇన్స్పిరేషన్. తను నాకు అమ్మ మాత్రమే కాదు నాన్న కూడా! నా జీవితంలో అన్ని పాత్రలు తనే పోషించింది. ఆవిడే నా సర్వస్వం.(చదవండి: గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు హీరోయిన్ డుమ్మా.. ఎందుకంటే?)అదే నన్నింకా బాధిస్తోంది!మా అమ్మ.. ప్రేమ, త్యాగానికి నిలువెత్తు నిదర్శనం. తన గురించి నేనెంత చెప్పినా తక్కువే! ఆవిడ గురించి తెలుసుకోకుండా తప్పుగా మాట్లాడటం అన్యాయం, దారుణం. నన్నింకా బాధిస్తుందేంటో తెలుసా? ఇప్పటికీ తనను ద్వేషిస్తున్నారు. తను అంత బాధ (జైలు జీవితం) అనుభవించినా కూడా ఇప్పటికీ తనను కాల్చుకు తింటున్నారు. నేను టీనేజర్‌ను. మీ అసహ్యకరమైన కామెంట్లు నన్నెంత బాధిస్తున్నాయో తెలుసా! మా అమ్మను దోషిగా నిలబెట్టారు. ఈ భారాన్ని నేను మోయలేకున్నాను.మా అమ్మ హీరోమా అమ్మ ఎప్పుడూ ఎవరినీ గాయపర్చలేదు. ఒక్కసారి కూడా తను ఎవర్నీ బాధపెట్టలేదు. పైగా తన సొంత ఖర్చులతో వేరేవారి బాగోగులు కూడా చూసుకునే మంచి మనిషి. అలాంటి తనపై మనసు లేని మనుషులు ఇంకా బురద చల్లాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. బాధగా ఉంది. తనకిలాంటి పరిస్థితి వచ్చినందుకు మరింత బాధగా ఉంది. మా అమ్మ ఉత్తమురాలు. ఏం జరిగినా నేను తన వెంటే ఉంటాను. దయచేసి ముందూవెనకా ఆలోచించి మాట్లాడండి. మా అమ్మ నాకు హీరో.. దాన్నెవరూ మార్చలేరు అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది.అభిమాని హత్యకాగా పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు పంపాడన్న కారణంతో కర్ణాటకకు చెందిన రేణుకాస్వామి (Renuka Swamy Murder Case)ని హీరో దర్శన్ చంపారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈమేరకు కొన్ని సాక్ష్యాలు సేకరించిన పోలీసులు గతేడాది జూలైలో దర్శన్, పవిత్రగౌడను అరెస్టు చేశారు. ఇటీవలే వీరు బెయిల్‌పై బయటకు వచ్చారు.చదవండి: టీవీలో నాన్నను చూసి మురిసిపోయిన క్లీంకార..వీడియో వైరల్