
అభిమాని రేణుకాస్వామి హత్య కేసు నిందితులు హీరో దర్శన్ (Darshan), అతడి ప్రేయసి, నటి పవిత్రగౌడ (Pavithra Gowda) ఆలయాల బాటపట్టారు. దైవభక్తిలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. తాజాగా పవిత్రగౌడ మహాకుంభమేళాకు వెళ్లింది. మౌని అమావాస్య రోజు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఆశీర్వాదం..
ఎంతో పవిత్రమైన మౌని అమావాస్య రోజు మహాకుంభమేళా (Mahakumbh 2025)లో స్నానం ఆచరించడాన్ని ఆశీర్వాదంగా భావిస్తున్నాను. నెగెటివ్ ఎనర్జీ నుంచి నాకు స్వేచ్ఛ లభించిందని నమ్ముతున్నాను. హరహర మహాధేవ్ అని క్యాప్షన్ జోడించింది. ఒకరి కుటుంబాన్ని నాశనం చేసి నువ్వు మాత్రం స్వేచ్ఛగా తిరుగుతున్నావా? అంటూ నెటిజన్లు నటిని తిట్టిపోస్తూనే ఉన్నారు. దీంతో ఆమె మరో పోస్ట్ పెట్టింది.
మరింత బాధ, శోకం..
మతానికి, అన్యాయానికి జరిగిన సంఘర్షణలో మతమే గెలుస్తుంది. ఒకవేళ మొదట అన్యాయం విజయం సాధించినా చివరకు గెలిచేది మాత్రం మతమే! నన్ను తిడుతూ, నన్ను బాధపెడుతున్న న్యూస్ ఛానల్స్, సోషల్ మీడియా సైట్స్‌కు థాంక్స్. హద్దులు మీరుతూ మీరు చేస్తున్న కామెంట్లు నా మనసును మరింత బాధకు గురి చేస్తున్నాయి. ఇంకా శోకంలోకి నెట్టేస్తున్నాయి అని రాసుకొచ్చింది.
చదవండి: సన్యాసిగా మారిన హీరోయిన్‌పై బహిష్కరణ వేటు