
బెంగళూరు: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిమాని రేణుకా స్వామి హత్యకేసులో గురువారం కన్నడ స్టార్ నటుడు దర్శన్ తూగుదీప ప్రియురాలు పవిత్రా గౌడ మరో సారి అరెస్ట్ అయ్యారు.
రేణుకా స్వామి హత్యకేసులో ఏ1 నిందితురాలు పవిత్రా గౌడకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కర్ణాటక హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను.. గురువారం సుప్రీంకోర్టు రద్దు చేసింది. తక్షణమే ఆమెను అరెస్టు చేయాలని ఆదేశాలు జారీచేసింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో.. పోలీసులు నటి సప్తమిగౌడను అదుపులోకి తీసుకున్నారు.
కాగా, ఇదే హత్యకేసులో ఏ2గా ఉన్న దర్శన్ బెయిల్‌ను ఇవాళ సైతం దేశ అత్యున్నత న్యాయ స్థానం రద్దు చేసింది. బెయిల్ రద్దుతో పోలీసులు అతనిని అరెస్ట్ చేయగా.. కొద్ది సేపటి క్రితమే ఆర్ఆర్ నగర్‌లో ఉన్న పవిత్రగౌడను అదుపులోకి తీసుకున్న పోలీసులు జైలుకు తరలించారు.
Kannada actor #DarshanThoogudeepa's friend #PavithraGowda on Thursday was arrested by the #BengaluruPolice after the #SupremeCourt cancelled her bail in connection to the #RenukaswamyMurderCase.pic.twitter.com/dlEovoXxFT https://t.co/y6tgvcfOep
— Hate Detector 🔍 (@HateDetectors) August 14, 2025
కర్ణాటక హైకోర్టు గతంలో దర్శన్, పవిత్ర గౌడ సహా ఏడుగురికి బెయిల్ మంజూరు చేసింది. కర్ణాటక ప్రభుత్వం ఆ బెయిల్‌ను రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై గురువారం (ఆగస్టు14) జస్టిస్ జేబీ పార్దివాలా,ఆర్ మహాదేవన్ ఉన్న ధర్మాసనం విచారణ చేపట్టింది. హైకోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టింది.
సెషన్ కోర్టు (కర్ణాటక హైకోర్టు)ఇచ్చిన తీర్పులో అనేక లోపాలు ఉన్నాయని,ఆమెకు బెయిల్ ఇవ్వడానికి ఎటువంటి చట్టపరమైన కారణం లేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.అదే సమయంలో దర్శన్ తూగదీపకు బెయిల్ ఇస్తే న్యాయ పరిపాలనను పట్టాలు తప్పే ప్రమాదం కలిగిస్తుందని పేర్కొంది.
నిందితులను వెంటనే కస్టడీలోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. విచారణ త్వరగా జరగాలని కింది కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. జైలులో నిందితులకు ప్రత్యేక సౌకర్యాలఉ అందించాల్సిన అవసరం లేదని కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టు హెచ్చరించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆర్ ఆర్‌నగర్‌లో ఉన్న పవిత్రగౌడను.. మైసూర్‌లో ఉన్న దర్శన్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.
దర్శన్ వీరాభిమాని రేణుకాస్వామి నటి పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఇదే కారణంతో జూన్ 2024లో రేణుకా స్వామిని.. పవిత్ర గౌడతో పాటు దర్శన్ అతని అనుచరులు కిడ్నాప్ చేశారు. బెంగళూరులోని ఒక షెడ్‌లో మూడు రోజుల పాటు నిర్బంధించి చిత్ర హింసలకు గురిచేశారు. చిత్రహింసలు తాళలేక రేణుకాస్వామి మరణించారు. డెడ్ బాడీని మురికి కాలువలో పడేసి పారిపోయారు. ఈ కేసులో దర్శన, పవిత్రగౌడ, మరో 15 మంది అరెస్ట్ అయ్యారు.