సాక్షి హైదరాబాద్: మహిళా సాధికారదతతో స్వయం ఉపాధి కల్పించే దిశగా తెలంగాణ మహిళా భద్రతా విభాగం కీలక చర్యలు చేపడుతుంది. హైదరాబాద్ పోలీసుల సహకారంతో హైదరాబాద్‌లోని మహిళలకు డ్రైవర్ ఉద్యోగ మేళాను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా బైక్ టాక్సీ, ఈ-ఆటో డ్రైవింగ్‌లో వారికి శిక్షణ ఇవ్వనున్నారు. దీనికోసం 21-45 సంవత్సరాల మద్య వయసున్న మహిళలు (కేవలం హైదరాబాద్ వాసులే) అర్హులని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో ఉచిత డ్రైవింగ్ శిక్షణతో పాటు లైసెన్స్ జారీలో సహాయం కల్పించనున్నట్లు తెలిపారు. వాటితో పాటు వాహనానికి లోన్ లేదా లీజ్ సౌకర్యం కల్పించనున్నట్లు ప్రకటించారు. వీటికి డ్రైవింగ్‌లో ఎటువంటి అనుభవం లేకున్నా అప్లై చేసుకోవచ్చన్నారు. జనవరి 3 శుక్రవారం అంబర్‌పేట్ పోలీస్ గ్రౌండ్ వేదికగా ఈ కార్యక్రమం జరపనున్నట్లు ప్రకటించారు.
ఈ విషయాన్ని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఆసక్తి గల మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరిన్ని వివరాలకు 89788 62299 నెంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.
స్టీరింగ్ పట్టండి.. స్వశక్తితో ఎదగండి!
హైదరాబాద్‌లోని మహిళలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా తెలంగాణ మహిళా భద్రతా విభాగం, హైదరాబాద్ పోలీసుల సహకారంతో డ్రైవర్ ఉద్యోగ మేళాను నిర్వహిస్తోంది.
మహిళల భద్రత, ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా బైక్ టాక్సీ, ఈ-ఆటో డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నారు.… pic.twitter.com/NMIdrEmJZX— V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 29, 2025


