లష్కరే, హిజ్బుల్, జైషే ఉగ్రవాదుల్లో గుబులు..!!
పాకిస్థాన్ ఐఎస్‌పీఆర్ నుంచి హెచ్చరికలంటూ సందేశాలు
అప్రమత్తమవుతున్న ఉగ్రవాద శిబిరాలు
‘ఆపరేషన్ సిందూర్ 2.0’ మార్చినెలలోనే మొదలు కానుందా? కశ్మీరంలో మంచు కరిగి.. ఎండాకాలం మొదలవ్వగానే సైన్యం రంగంలోకి దిగి, ఉగ్రవాదుల పీచమణచనుందా?? ఈ దెబ్బతో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాదులకు దబిడిదిబిడేనా?? ఈ ప్రశ్నలకు భారత వర్గాల నుంచి ఎలాంటి సమాచారం లేకున్నా.. పీవోకేలో లాంచ్ ప్యాడ్లను ఏర్పాటు చేసుకుని, భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్న లష్కరే తాయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలు మాత్రం అవుననే సమాధానం ఇస్తున్నాయి. అటు పీవోకేతోపాటు.. ఇటు జమ్మూకశ్మీర్‌లో పాగావేసుకున్న ఉగ్రవాదులు సైతం ఈ సమాచారంతో బెంబేలెత్తుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల అనంతరం ఉగ్రవాద సంస్థలు ఈ మేరకు సమాచారాన్ని అందిపుచ్చుకున్నాయి. రెండు పేజీల సందేశాన్ని ఉగ్రవాద సంస్థలు పరస్పరం అందిపుచ్చుకుంటున్నాయని, అందులో పాకిస్థాన్ నిఘా సంస్థ హెచ్చరికలను ఉటంకిస్తున్నాయని అత్యంత విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి.
ఈ పత్రిక ద్వారా ఉగ్రవాదులకు సైన్యం ఆపరేషన్, తదుపరి సన్నాహాల గురించి తెలియజేస్తున్నారు. 33 ఏళ్లుగా పరారీలో ఉన్న జహంగీర్ అనే ఉగ్రవాదితో ఇంటర్వ్యూ కూడా ఇందులో ఉంది.
చొరబాట్ల ప్రణాళిక సిద్ధం, రాశారు- పరిస్థితికి సమాధానం ఇవ్వకపోతే పరిస్థితి మరింత దిగజారుతుంది ఉగ్రవాద సంస్థలు సందేశం ఇవ్వడానికి ZUV పేరుతో లేఖ పంపుతున్నాయి. ZUV అంటే - నా ఆత్మ యొక్క ఉనికి ద్వారా నా జీవితం ఉంది. నెల రోజుల వ్యవధిలోనే ఈ నెట్ వర్క్ తరపున పలుమార్లు ప్రకటనలు చేసి ఉగ్రవాద గ్రూపులకు పంపారు. ఈ ప్రకటనలలో ఒకటి 9 పేజీలు. దాని చివరి పేజీలో, భారత సైన్యం యొక్క సన్నద్ధత గురించి ప్రస్తావన ఉంది. నవంబర్ 10న జరిగిన ఢిల్లీ పేలుళ్లను ప్రస్తావిస్తూ హెచ్చరికలు జారీ చేశారు. అయితే.. ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో ఉన్న ఈ లేఖలు డిసెంబరు చివరి వారంలో విడుదలైనట్లు తెలుస్తోంది.
ఢిల్లీ పేలుళ్ల తర్వాత..
ఇటీవలి ఢిల్లీ పేలుళ్ల తర్వాత భారత బలగాలు అప్రమత్తమైనట్లు ఉగ్రవాద మూకలు గుర్తించాయి. దీంతో.. శీతాకాలం ముగిసేలోపే కశ్మీర్‌లో పాగా వేయాలని నిర్ణయించాయి. ఒకవేళ ఈ టాస్క్ తప్పితే.. మార్చిలో భారత సైన్యం ప్రారంభించే ‘ఆపరేషన్ సిందూర్ 2.0’తో ఇబ్బందులు తప్పవని ఆ లేఖలో హెచ్చరించాయి. ఈలోగానే తమతమ ఉగ్రవాద సంస్థల్లో జోరుగా రిక్రూట్‌మెంట్లు నిర్వహించాలని ఆ లేఖలో తీర్మానించాయి. ‘‘సైన్యం కార్యకలాపాలపై స్థానికులతో నిఘా పెంచాలి. సంస్థలతో సంబంధం లేకుండా.. భారత సైన్యం ప్రణాళికలను అడ్డుకోవాలి. ఢిల్లీ పేలుళ్లు, నౌగామ్‌లో పేలుడుతో పోలీసులు, భారత సైన్యం కసితో ఉన్నాయి. రాటిల్ పవర్ ప్రాజెక్టుపై దృష్టిపెట్టాయి’’ అని ఆ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.
కాగా.. రాటిల్ పవర్ ప్రాజెక్టు వద్ద పోలీసులు అరెస్టు చేసిన మహమ్మద్ అమీస్ అలియాస్ జహంగీర్ సరూరీ 1992 నుంచి హిజ్బుల్ ముజాహిదీన్ కోసం క్రియాశీలంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతను పలు హత్య కేసుల్లో నిందితుడు. గతంలో ‘ద రివల్యూషన్ రీసర్జెన్స్’ అనే మ్యాగజైన్‌లో అతని ఇంటర్వ్యూ ప్రచురితమైనట్లు భారత భద్రతాబలగాలు గుర్తించాయి. ఆ ఇంటర్వ్యూలో జహంగీర్ తాను త్యాగం వైపు అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నాడు.


