అరుదైన భారతదేశపు అత్యంత విషపూరిత సర్పం ఓ కెమెరాకు చిక్కింది. అయితే అది భయాందోళనలను కలగించడానికి బదులుగా వన్యప్రాణుల పట్ల ఆసక్తిని, ఆరాధనను పెంచేలా ఉండడం విశేషం. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కాస్వాన్ రాత్రి గస్తీ సమయంలో అత్యంత విషపూరితమైన బ్యాండేడ్ క్రైట్ (కట్లపాము)(Banded krait)ను చిత్రీకరించారు. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో షేర్ చేశారు. ఇది భారత దేశంలో అరుదుగా కనిపించే వన్యప్రాణుల వైవిధ్యభరిత వీక్షణ అవకాశాన్ని నెటిజన్స్‌కు అందించి, స్వల్ప వ్యవధిలోనే ఈ వీడియో వైరల్ గా మారింది.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి కాస్వాన్ రాత్రి గస్తీ విధుల్లో భాగంగా అటవీ ప్రాంతం గుండా వెళుతుండగా ఆయనకు ఈ పొడవైన విషసర్పం ఎదురైంది. ఫుటేజ్‌లో పాము ఎక్కడా దూకుడును ప్రదర్శించలేదు. ఆ చీకటిలో బ్యాండేడ్ క్రైట్ ప్రశాంతంగా కదులుతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. దాని ముదురు పసుపు నలుపు చారలు స్పష్టంగా ప్రకాశవంతంగా మెరుస్తున్నాయి. కాస్వాన్ తన పోస్ట్‌లో స్పష్టమైన రూపాన్ని చారలను విలక్షణంగా వర్ణించారు. ఈ కట్లపాము భారతదేశంలోని అత్యంత విషపూరితమైన పాములలో ఒకటి అయినప్పటికీ, ఇది చూడడానికి కూడా అంతే అందమైన అద్భుతమైన రూపం కలిగి ఉండడాన్ని ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు. బురద నీటిలో ఎదురీదుతూ అది కదులుతున్నప్పుడు పాకుతున్న దాని వంటి మీది చారలు స్పష్టంగా కనిపించాయి. చుట్టుపక్కల ఉన్న గడ్డి పాము గుర్తులను మరింత హైలైట్ చేసింది. ఈ వీడియో చూసేవారిని కన్నార్పనీయకుండా చేస్తోంది.
నెటిజన్ల స్పందన...
ఈ వీడియోను చూసిన తర్వాత దానిపై వచ్చిన రకరకాల స్పందనలు వన్యప్రాణుల పట్ల ఆసక్తికి అద్దం పట్టాయి. చాలా మంది వీక్షకులు పాము రంగు ప్రాముఖ్యతను ఎత్తి చూపారు. వారు దీనిని అపోస్మాటిజం (తమను వేటాడే జంతువుల నుంచి రక్షించుకోవడానికి, వాటికి హెచ్చరిక సంకేతాలను అందించడం కోసం ప్రకాశవంతమైన రంగులు ఉండడం) తాలూకు క్లాసిక్ కేస్‌గా వివరించారు. ఈ మనుగడ వ్యూహం ప్రమాదాన్ని స్పష్టంగా సూచిస్తాయి. ఆన్ లైన్ లో. వీక్షణకు వీలుగా స్పష్టత చాలా బాగుందని వినియోగదారులు ప్రశంసించారు. మరొక వీక్షకుడు ఆ చారల గుర్తులను రోడ్ డివైడర్‌లతో పోల్చారు. మొత్తంగా విజువల్స్‌ను అద్భుతమైనవిగా వర్ణించారు.
Those beautiful bands. Banded krait is highly venomous snake found in India. Found this randomly during night patrolling. How nature provided them so distinct bands !! pic.twitter.com/it2s1vf8yY
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) December 28, 2025
అటవీ అధికారుల విధి నిర్వహణపై అవగాహన
వీడియో భారీ సంఖ్యలో ప్రశంసలతో పాటు అనేక అంశాలపై చర్చను రేకెత్తించింది. సౌందర్యంతో పాటు అంతకు మించి ఈ క్లిప్ అటవీ అధికారుల కఠినమైన విధులను హైలైట్ చేసింది. ప్రమాదకరమైన వన్యప్రాణుల మధ్య నిర్వహించే రాత్రి గస్తీని వీరు ఎంత సవాలుతో కూడిన పరిస్థితులలో నిర్వహిస్తారనేది కూడా వెల్లడించింది. ఈ వీడియో రాత్రిపూట జీవవైవిధ్యాన్ని గుర్తు చేస్తుంది. వన్యప్రాణులు మానవ ప్రదేశాలకు ఎంత దగ్గరగా ఉన్నాయో కూడా ఇది చూపించింది.


