విభాగాల వారీగా టాప‌ర్లు వీరే | JEE Main 2026 results category wise details | Sakshi
Sakshi News home page

JEE Main 2026 results: విభాగాల వారీగా టాప‌ర్లు వీరే

Feb 16 2026 7:57 PM | Updated on Feb 16 2026 8:14 PM

JEE Main 2026 results category wise details

జేఈఈ మెయిన్ -2026 సెష‌న్ 1 ఫ‌లితాల‌ను నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సోమ‌వారం సాయంత్రం విడుద‌ల చేసింది. జ‌న‌వ‌రి 21, 22, 23, 24, 28 తేదీల్లో జ‌రిగిన బీఈ, బీటెక్ పేప‌ర్ 1 ఫలితాల‌ను ఎన్టీఏ వెల్ల‌డించింది. 13,04,653 మంది విద్యార్థులు ప‌రీక్ష రాయ‌గా 96.26 శాతం మంది ఉత్తీర్ణ‌త సాధించిన‌ట్టు ఎన్టీఏ తెలిపింది. 326 న‌గ‌రాల్లోని 658 సెంట‌ర్లలో జేఈఈ మెయిన్ -2026 సెష‌న్ 1 ప‌రీక్ష నిర్వ‌హించారు. ఇందులో ఇండియా వెలుప‌ల నిర్వ‌హించిన 15 సెంట‌ర్లు కూడా ఉన్నాయి. 

కాగా ఈసారి పేప‌ర్ 1లో 12 మంది 100 ప‌ర్సంటైల్ సాధించారు. బాలిక‌లు ఎవ‌రూ 100 ప‌ర్సంటైల్ సాధించ‌లేక‌పోయారు. గ‌తేడాది రెండు సెష‌న్ల‌లో క‌లిసి మొత్తం 24 మంది 100 ప‌ర్సంటైల్  సాధించారు. వీరిలో ఇద్ద‌రు అమ్మాయిలు ఉన్నారు. 


జ‌న‌ర‌ల్‌- ఈడ‌బ్ల్యూఎస్‌
శ్రేష్ట్ జ‌సోరియా (రాజ‌స్థాన్‌)

బాలికల విభాగం
ఆషి గ్రేవాల్ (హ‌రియాణా)

పీడ‌బ్ల్యూబీడీ
హ‌ర్ష్ జైన్ (మ‌ధ్య‌ప్ర‌దేశ్‌)

ఎస్టీ విభాగం
ద‌క్ష్ షెహ్రా (రాజ‌స్థాన్‌)

ఎస్సీ విభాగం
దేవ శ్రీవేద్ (ఆంధ్ర‌ప్ర‌దేశ్‌)

ఓబీసీ- ఎన్‌సీఎల్‌
న‌రేంద్ర‌బాబుగారి మ‌హిత్ (ఆంధ్ర‌ప్ర‌దేశ్‌)

100 ప‌ర్సంటైల్ సాధించిన విద్యార్థులు వీరే
1. శ్రేయస్‌ మిశ్రా (ఢిల్లీ)
2. నరేంద్రబాబు గారి మోహిత్ (ఆంధ్రప్రదేశ్‌)
3. శుభమ్‌ కుమార్ (బిహార్‌)
4. కబీర్‌ చిల్లర్ (రాజస్థాన్‌)
5. చిరాన్‌జిబ్‌ కార్ (రాజస్థాన్‌)
6. భవేశ్‌ పత్రా (ఒడిశా)
7. అనయ్‌ జైన్ (హరియాణా)
8. అర్నవ్‌ గౌతమ్ (రాజస్థాన్‌)
9. పసల మోహిత్ (ఆంధ్రప్రదేశ్‌)
10. మాధవ్‌ విరాదియా (మహారాష్ట్ర)
11. పురోహిత్‌ నిమయ్ (గుజరాత్‌)
12. వివన్‌ శరద్‌ మహీశ్వరి (తెలంగాణ)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement