న్యూఢిల్లీ: జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తాచాటారు. ఈరోజు(సోమవారం, ఫిబ్రవరి 16వ తేదీ) సాయంత్రం విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ముగ్గురు తెలుగు విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. తాజా జేఈఈ ఫలితాల్లో ముగ్గురు తెలుగు విద్యార్థులు 100 పర్సెంటైల్ సాధించారు. వీరిలో ఇద్దరు ఏపీకి చెందిన విద్యార్థులు ఉండగా, ఒక తెలంగాణ విద్యార్థి ఉన్నారు. శరత్ మహేశ్వరి, నరేంద్ర, మోహిత్ అనే తెలుగు విద్యార్థులు 100 పర్సెంటైల్ సాధించిన జాబితాలో ఉన్నారు.
ఓపెన్ కేటగిరిలో పసల మోహిత్ అనే విద్యార్థి 100 పర్సెంటైల్ సాధించగా, ఓబీసీ కేటగిరిలో టాపర్‌గా నరేంద్ర బాబు నిలిచారు. జేఈఈ మెయిన్స్ పరీక్షను 13.04 లక్షల మంది విద్యార్థులు రాశారు.
కాగా, దేశవ్యాప్తంగా జాతీయ విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్షలకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చిన సంగతి తెలిసిందే. గత మూడేళ్లతో పోలిస్తే ఈసారి జనవరి మెయిన్స్ పరీక్షలకు దరఖాస్తులు భారీగా పెరిగాయి. 2025 తొలి సెషన్‌కు 13.80 లక్షలు దరఖాస్తులు వచ్చాయి. ఇది 2024 కంటే అధికం. అదేవిధంగా 95 నుంచి 96 శాతం మంది పరీక్షలకు హాజరు కాగా, రెండు సెషన్లలోనూ భారీగా పోటీ పెరిగింది.
జేఈఈ మెయిన్స్ 2026 ఫలితాల్లో 100 పర్సెంటైల్ సాధించిన వారు వీరే
శ్రేయస్ మిశ్రా-ఢిల్లీ
నరేంద్ర బాబు- ఆంధ్రప్రదేశ్
శుభమ్ కుమార్-బిహార్
కబీర్ చిల్లర్-రాజస్తాన్
చిరాన్‌జిబ్ కార్-రాజస్తాన్
భవేశ్ పత్రా-ఒడిశా
అనయ్ జైన్-హర్యానా
అర్నవ్ గౌతమ్-రాజస్తాన్
పసల మోహిత్-ఆంధ్రప్రదేశ్
మాధవ్ విరాదియా-మహరాష్ట్ర
పురోహిత్ నిమయ్-గుజరాత్
వివన్ శరద్ మహీశ్వరి-తెలంగాణ


