దర్శన్‌ అండ్‌ గ్యాంగ్‌పై 3న తుది చార్జిషీట్ | Darshan Renukaswamy Murder Case: Court Orders Final Chargesheet Submission by Nov 3 | Sakshi
Sakshi News home page

దర్శన్‌ అండ్‌ గ్యాంగ్‌పై 3న తుది చార్జిషీట్

Nov 1 2025 9:43 AM | Updated on Nov 1 2025 11:53 AM

 Court Adjourns charge framing, Next hearing set for November 3

కర్ణాటక రాష్ట్రం: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో ఈ నెల 3న తుది చార్జిషీట్ ను కోర్టుకు సమర్పించాలని న్యాయస్థానం పోలీసులను అదేశించింది. కేసులో రెండో నిందితుడు నటుడు దర్శన్‌తో పాటు ఇతర నిందితులను కోర్టు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టారు. ఈ నెల 3న చార్జిషీట్ సమర్పించాలని, ఆరోజు నిందితులు తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాలని జడ్జి అదేశించారు.  నిందితులపై పోలీసులు దాఖలు చేసిన ఆరోపణలను న్యాయమూర్తి చదివి వినిపించారు. 

ఇవి నిజమేనా అని అడిగారు.  9 మంది నిందితులు నేరాన్ని అంగీకరిస్తే సాక్షులను విచారించే అవకాశం ఉంటుంది. చార్జిషీట్ లో దర్శన్‌పై పోలీసులు ఎలాంటి నేరారోపణ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. జైల్లో ఉన్న ఏడు మందితో పాటు కేసులోని 9 మందిపై పోలీసులు చార్జిషీట్ సమర్పించనున్నారు. అయితే కొందరి పేర్లును తొలగించే అవకాశం కూడా ఉంది. గతంలో నిందితులపై చార్జిషీట్ సమర్పించాలని పోలీసులపై ఒత్తిడి చేశారు. అయితే పీపీ  గడువు అడిగారు. దర్శన్‌ తరపున న్యాయవాది మాత్రం విచారణను ఎదుర్కొని కేసులో గెలిచి బయటకు వస్తామని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. 

దర్శన్, పవిత్ర గౌడల ఫొటోలు వైరల్‌ 
హత్య కేసు నిందితుడు నటుడు దర్శన్, పవిత్రాగౌడలు పెళ్లి చేసుకున్నట్లు ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారాయి. ఎవరో ఈ ఫోటోలను లీక్‌ చేశారని అనుమానిస్తున్నారు. దర్శన్, పవిత్రలిద్దరూ పెళ్లి బట్టలు ధరించినట్లు, పవిత్ర మెడలో పసువు దారం ఉన్నట్లు ఫొటోల్లో కనిపిస్తోంది. పవిత్రతో దర్శన్‌ అన్యోన్యంగా ఉన్నట్లు  సెల్ఫీ ఫొటో ఉంది. ఇవి పదేళ్లనాటి ఫొటోలని  నెటిజన్లు అంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement