తోటి ఖైదీలకు వేధింపులు
యశవంతపుర: చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్న ప్రముఖ నటుడు దర్శన్ తోటి ఖైదీలతో గొడవలు పడుతున్నట్టు తెలిసింది. తన సెల్‌లో ఉంటున్న ఇతర ఖైదీలను వేధిస్తున్నట్టు సమాచారం. దర్శన్ రెండోదఫా బెయిలు రద్దయి జైలుకు వచ్చాక నిబంధనలను కట్టుదిట్టం చేశారు.
దీంతో దర్శన్‌లో అసహనం పెరిగిపోయినట్టు జైలు వర్గాలు చెబుతున్నాయి. దర్శన్ ఇతర ఖైదీలను దూషిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. గతంలో దర్శన్‌కు తోటి ఖైదీ భోజనం తెచ్చి పెట్టేవారు. ఇటీవల కొందరు ఖైదీలు జల్సాలు చేసిన వీడియోలు రావడంతో ప్రభుత్వం కట్టుదిట్టం చేసింది. ఐపీఎస్ అంశుకుమార్‌ను జైలు అధికారిగా నియమించింది.


