పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యవహారం మరోసారి ఆ దేశంలో చర్చనీయాంశమయ్యింది. ఆయనను కలవడానికి ఎవరికీ అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో వారి కుటుంబసభ్యులతో పాటు ఆయన మద్ధతుదారులు నిరసనలు చేపడుతున్నారు. తాజాగా ఇమ్రాన్ సోదరిలు అడియాలా జైలు బయట ధర్నా చేపట్టారు.
కొద్దిరోజుల క్రితం పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాఫిక్‌గా మారింది. ఆయనను జైలులోనే చంపేశారు అని పుకార్లు రావడంతో ఇమ్రాన్ వ్యవహారం తీవ్ర వివాదాస్పదమైంది. ఆయన కుటుంబసభ్యులతో పాటు పీటీఐ మద్దతుదారులు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. దీంతో ఎట్టకేలకు అక్కడి ప్రభుత్వం ఆయనను కలవడానికి అనుమతిచ్చింది. దీంతో ఆయన సోదరి డా. ఖానుమ్ ఆయనను జైలులో కలిసింది. దీంతో ఆయన బ్రతికే ఉన్నాడని అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే తాజాగా మరోసారి ఇమ్రాన్ వ్యవహారం పాక్‌లో చర్చనీయాంశమైంది.
ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశాల ప్రకారం మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను కలవడానికి మంగళ, గురువారాల్లో అనుమతి ఇవ్వాలి. అయితే ఈ ఆదేశాలను అక్కడి అధికారులు పాటించడం లేదు. ఆయనను కలవడానికి వారి సోదరిమణులు ఆలీమాఖాన్, ఉజ్మా ఖాన్‌లను వారిని కలవడానికి అనుమతించడం లేదు. దీంతో వారు జైలు బయిట ఆందోళన చేపట్టారు.
దీంతో వారు జైలు బయిట ఖురాన్ చదువుతూ నిరసన చేపట్టారు. ఇమ్రాన్ సోదరి ఆలీమా ఖాన్ మాట్లాడుతూ.. మేము ఇక్కడ ఖురాన్ చదవడం పూర్తి చేస్తామని వారు భయపడుతున్నారు. ఎటువంటి మనుషులు వారు. అడియాలాకు వెళ్లే దారులన్నీ నిర్భందించారు. అని ఆమె తెలిపారు.అయితే మంగళ, గురవారాల్లో ఇమ్రాన్‌ను కలవడానికి అనుమతులివ్వాలని కోర్టు చెప్పడంతో ఆ రోజుల్లో అడియాలా జైలు ఎదుటు పెద్దఎత్తున నిరసనలు జరుగుతున్నాయని అక్కడి అధికారులు తెలిపారు.


