చేజారిన ఎల్లమ్మ.. కొత్త సినిమా ప్రకటించిన నితిన్‌ | Nithiin 36th Movie Announced With Director VI Anand | Sakshi
Sakshi News home page

Nithiin: కొత్త సినిమా ప్రకటించిన నితిన్‌.. దర్శకుడు ఎవరంటే?

Jan 25 2026 3:38 PM | Updated on Jan 25 2026 4:12 PM

Nithiin 36th Movie Announced With Director VI Anand

కొంతకాలంగా ట్రాక్‌ తప్పిన హీరో నితిన్‌ కొత్త సినిమా ప్రకటించాడు. దర్శకుడు విఐ ఆనంద్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇది నితిన్‌ కెరీర్‌లో 36వ సినిమాగా రాబోతోంది. ఈ మేరకు ఓ ఫోటో షేర్‌ చేశాడు. నో బాడీ నో రూల్స్‌.. వాస్తవ నిబంధనలు ఇప్పుడే మారిపోయాయి. నా సోదరులు దర్శకుడు ఆనంద్‌, నిర్మాత శ్రీనివాస్‌గారితో ప్రయాణం చేయడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నాను అని రాసుకొచ్చాడు.

ఎల్లమ్మ చేజారె..
పోస్టర్‌లో నితిన్‌ సిగరెట్‌ తాగుతున్నట్లుగా చూపించారు. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ మూవీ నిర్మించనున్నాడు. నిజానికి నితిన్‌ బలగం వేణుతో ఎల్లమ్మ సినిమా చేయాల్సింది. కానీ, ఆ ప్రాజెక్టు అతడి నుంచి చేజారి దేవిశ్రీప్రసాద్‌ను వరించింది. ఏదేమైనా ఆనంద్‌ డైరెక్షన్‌లో నితిన్‌ హిట్టు కొడతాడేమో చూడాలి! వీఐ ఆనంద్‌.. హృదయం ఎక్కడున్నాది, టైగర్‌, ఎక్కడికి పోతావు చిన్నవాడ, ఒక్క క్షణం, డిస్కోరాజా, ఊరు పేర భైరవకోన వంటి సినిమాలు తెరకెక్కించాడు.

 

 

చదవండి: బిగ్‌బాస్‌ సోనియా కూతురి బారసాల ఫంక్షన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement