ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం | Air India Express Flight Makes Emergency Landing In Kochi After Landing Gear Issue, More Details Inside | Sakshi
Sakshi News home page

ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

Dec 18 2025 11:32 AM | Updated on Dec 18 2025 1:04 PM

Air India Express: Flight Emergency Landing In Cochin with Landing Gear Issues

కొచ్చి: ఎయిరిండియా విమానానికి ప్రమాదం తప్పింది. జెడ్డా నుండి కోజికోడ్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం (IX 398)లో గురువారం ఉదయం సమస్య ఏర్పడటంతో కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేసింది. ఆ సమయంలో విమానంలో 160 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. 

ఎయిరిండియా విమానం కోజికోడ్‌కు వెళ్తుండగా, కుడి వైపు ప్రధాన ల్యాండింగ్ గేర్, టైర్‌లో సమస్య ఏర్పడింది. దాంతో వెంటనే విమానాన్ని కొచ్చి వైపు మళ్లించి ఉదయం 9 గంటల సమయంలో అత్యవసర పరిస్థితుల్లో ల్యాండింగ్ నిర్వహించారు. CIAL (Cochin International Airport Limited) ప్రకటన ప్రకారం.. అన్ని అత్యవసర సేవలను ముందుగానే సిద్ధం చేసి, ల్యాండింగ్‌ను విజయవంతంగా సులభతరం చేశారు.  

ల్యాండింగ్ తర్వాత చేసిన తనిఖీలో కుడి వైపున ఉన్న రెండు టైర్లు పగిలిపోయినట్లు నిర్ధారించారు. ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బందికి ఎటువంటి గాయాలు జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. అనంతరం రన్‌వేను క్లియర్ చేసి, సాధారణ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement