టీమిండియాలోకి ఎవరూ ఊహించని ప్లేయర్లు? | Ruturaj Gaikwads Comeback For India vs West Indies ODIs Fuelled | Sakshi
Sakshi News home page

IND vs WI: టీమిండియాలోకి ఎవరూ ఊహించని ప్లేయర్లు?

Sep 13 2026 12:52 PM | Updated on Sep 13 2026 1:13 PM

Ruturaj Gaikwads Comeback For India vs West Indies ODIs Fuelled

PC: X

ఈ నెల‌ఖారులో వెస్టిండీస్‌తో ప్రారంభం కానున్న వ‌న్డే, టీ20 సిరీస్‌కు భార‌త జ‌ట్ల‌ను బీసీసీఐ సెల‌క్ష‌న్ కమిటీ సోమవారం ప్రకటించే అవకాశముంది. అయితే మహారాష్ట్ర బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ తిరిగి వన్డే జట్టులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వైస్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ ఆసియా క్రీడ‌ల కోసం జపాన్‌కు వెళ్ల‌నుండ‌డంతో అత‌డి స్దానంలో గైక్వాడ్‌ను ఎంపిక చేయాల‌ని సెల‌క్ట‌ర్లు భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. 

భారత్-వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్ సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభం కానుండగా.. అదే సమయంలో భారత మరో జట్టు ఆసియా క్రీడల్లో బిజీగా ఉండనుంది. ఒకే సమయంలో రెండు వేర్వేరు టోర్నీలు జరుగుతుండటంతో జట్ల ఎంపిక సెలక్టర్లకు పెద్ద సవాలుగా మారింది. శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌ జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ వంటి కీలక ప్లేయర్లు ఏషియన్ గేమ్స్ కారణంగా విండీస్‌తో వన్డేలకు అందుబాటులో ఉండకపోవచ్చు. 

ఒకవేళ బుమ్రా ఆసియా క్రీడల్లో పాల్గొనకపోతే కచ్చితంగా విండీస్ సిరీస్‌లో ఆడుతాడు. రుతురాజ్ చివ‌ర‌గా డిసెంబర్ 2025లో దక్షిణాఫ్రికాపై భార‌త త‌ర‌పున ఆడాడు. ఈ మ్యాచ్‌లో సెంచ‌రీ సాధించిన‌ప్ప‌టికి, జ‌ట్టులో పోటీ కార‌ణంగా అత‌డు చోటు కోల్పోయాడు.

సీనియ‌ర్ జ‌ట్టులో లేక‌పోయినా భారత 'ఎ' జట్టులో మాత్రం రెగ్యులర్‌ సభ్యునిగా రుతురాజ్‌ ఉన్నాడు. ఆస్ట్రేలియా 'ఎ'తో జరగనున్న అనాధికరిక వన్డే సిరీస్‌లో ఇండియా-ఎ కెప్టెన్‌గా గైక్వాడ్‌ వ్యవహరించనున్నాడు. ఇక గైక్వాడ్‌తో పాటు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ కూడా తిరిగి వన్డే జట్టులోకి రానున్నట్లు సమాచారం. కేఎల్ రాహుల్‌కు బ్యాకప్‌గా అతడిని తీసుకోవాలని సెలక్టర్లు యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఆసియాక‌ప్, విండీస్ వ‌న్డే షెడ్యూల్‌

సెప్టెంబర్ 27: విండీస్‌తో తొలి వన్డే

సెప్టెంబర్ 28: ఆసియా క్రీడల క్వార్టర్ ఫైనల్ మ్యాచ్

సెప్టెంబర్ 30: గౌహతిలో విండీస్‌తో రెండో వన్డే

అక్టోబర్ 1: ఆసియా క్రీడల సెమీ-ఫైనల్

అక్టోబర్ 3: విండీస్‌తో మూడో వన్డే.. అదే రోజు ఆసియా క్రీడల స్వర్ణ, కాంస్య పతకాల మ్యాచ్‌లు
చదవండి: హెడ్‌కోచ్‌గా సౌరవ్‌ గంగూలీ.. బ్యాటింగ్‌ కోచ్‌గా యువరాజ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement