PC: bcci
భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ హర్లీన్ డియోల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉమెన్స్ కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడేందుకు డియోల్ సిద్దమైంది. ఈ క్రమంలో డిఫెండింగ్ ఛాంపియన్ 'బార్బడోస్ రాయల్స్' జట్టుతో ఆమె ఒప్పందం కుదుర్చుకుంది. ఈ చండీగఢ్ క్రికెటర్ ఇప్పటికే బార్బడోస్ చేరుకుంది.
కాగా 28 ఏళ్ల హర్లీన్ డియోల్ సీనియర్ భారత జట్టులో గానీ, 'ఇండియా ఎ' జట్టులో గానీ సభ్యురాలు కాకపోవడంతో ఈ టోర్నమెంట్ మొత్తానికి అందుబాటులో ఉండనుంది. ప్రస్తుతం జరుగుతున్న ఉమెన్స్ సీపీఎల్‌లో మొత్తం ఐదుగురు భారత మహిళా క్రికెటర్లు పాల్గొంటున్నారు.
హర్లీన్ డియోల్, కిరణ్ నవ్‌గిరే, పూజా వస్త్రాకర్‌లు బార్బడోస్ రాయల్స్‌లో భాగం కాగా.. శిఖా పాండే, యస్తికా భాటియా ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరపున ఆడుతున్నారు. డియోల్ భారత్ తరఫున 28 టీ20 మ్యాచ్‌లలో 92.01 స్ట్రైక్ రేట్‌తో 311 పరుగులు చేసింది.
ఈ ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆమె చివరిసారిగా టీమిండియాకు ప్రాతినిధ్యం వహించింది. అయితే డబ్ల్యూపీఎల్‌లో మంచి రికార్డు ఉన్న హర్లీన్, 28 మ్యాచ్‌లలో 649 పరుగులు సాధించింది.
చదవండి: యూఎస్ ఓపెన్ విజేతగా రైబాకినా


