చేజారిన టైటిల్.. కోపంతో రాకెట్‌ విరగ్గొట్టిన సబలెంకా! వీడియో | Aryna Sabalenka destroys racket in wild meltdown after losing US Open final | Sakshi
Sakshi News home page

US Open: చేజారిన టైటిల్.. కోపంతో రాకెట్‌ విరగ్గొట్టిన సబలెంకా! వీడియో

Sep 13 2026 8:42 AM | Updated on Sep 13 2026 10:51 AM

Aryna Sabalenka destroys racket in wild meltdown after losing US Open final

PC: X

యూఎస్ ఓపెన్-2026లో పోలాండ్ టెన్నిస్ స్టార్ అరీనా సబలెంకాకు  తీవ్ర నిరాశ ఎదురైంది. వరుసగా మూడోసారి ఛాంపియన్‌గా నిలిచి హ్యాట్రిక్ కొట్టాలనుకున్న ఆమె కల నెరవేరలేదు. ఆర్థర్ యాష్ స్టేడియం వేదికగా జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఎలెనా రిబాకినా చేతిలో 6-4, 5-7, 6-2 తేడాతో సబలెంకా ఓటమి పాలైంది. 

అయితే ఈ పరాజయం అనంతరం సబలెంకా తీవ్ర అసహనానికి గురైంది. తన సొంత తప్పిదాల కారణంగా ఓటమి పాలవ్వడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. విజేతగా నిలిచిన రిబాకినాను అభినందించిన తర్వాత సబలెంకా బెంచ్ వద్దకు వెళ్లి తన రాకెట్‌ను నేలకేసి బలంగా కొట్టింది. కొట్టి ముక్కలు చేసింది. 

అంతటితో ఆగకుండా ప్రజెంటేషన్ సమయంలో తనను చిత్రీకరిస్తున్న కెమెరామెన్‌పై కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది.
చదవండి: టీమిండియా నుంచి తీసేశారు.. క‌ట్ చేస్తే! వెస్టిండీస్‌లో?


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement