PC: IPL/BCCI
షేర్-ఈ-పంజాబ్ టీ20 లీగ్‌లో లూధియానా లయన్స్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం మొహాలీ స్టేడియం వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్లో జలంధర్ వారియర్స్‌పై 17 పరుగుల తేడాతో విజయం సాధించిన లూథియనా.. తొలిసారి తుది పోరుకు అర్హత సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ ఆటగాడు, లూథియానా కెప్టెన్ సైల్ ఆరోరా విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు.
ఈ క్రమంలో ఆరోరా కేవలం 50 బంతుల్లో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మొత్తంగా 56 బంతులు ఎదుర్కొన్న ఆరోరా 7 ఫోర్లు, 10 సిక్స్‌లతో 120 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు మాధవ్ సింగ్(22 బంతుల్లో 42) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
బాస్కర్ మ్యాజిక్
అనంతరం లక్ష్య చేధనలో జలంధర్ వారియర్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. జలంధర్ కెప్టెన్ ప్రభ్‌సిమ్రన్ సింగ్( 35 బంతుల్లో 63 పరుగులు) హాఫ్ సెంచరీ సాధించినప్పటికి తన జట్టును గెలిపించలేకపోయాడు. రైట్ ఆర్మ్ పేసర్ సాహిల్ బాస్కర్ బంతితో మ్యాజిక్ చేశాడు. బాస్కర్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 16 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: టీమిండియా నుంచి తీసేశారు.. కట్ చేస్తే! వెస్టిండీస్‌లో?
Salil Arora scored Century in Sher E Punjab league Semi Final🧡💪🏻
Took his team from 27-3(4.2) to 220-5(20) batting at No. 03 scored 120(56)* pic.twitter.com/C9QMXqVxTY— Neil🔪 (@PsychDominant) September 12, 2026


