టైటిల్‌కు అడుగు దూరంలో... | Isharani Baruah Enters Final At Vietnam Open | Sakshi
Sakshi News home page

టైటిల్‌కు అడుగు దూరంలో...

Sep 13 2026 12:45 AM | Updated on Sep 13 2026 12:45 AM

Isharani Baruah Enters Final At Vietnam Open

హో చి మిన్హ్‌ సిటీ (వియత్నాం): భారత యువ షట్లర్‌ ఇషారాణి బారువా వియత్నాం ఓపెన్‌ సూపర్‌–100 బ్యాడ్మింటన్‌ టోర్నీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో మూడో సీడ్‌ ఇషారాణి 21–10, 21–18తో భారత్‌కే చెందిన ఆరో సీడ్‌ రక్షితశ్రీపై విజయం సాధించింది. మరో సెమీఫైనల్లో టాప్‌ సీడ్, భారత యువ షట్లర్‌ తన్వీ శర్మ 19–21, 20–22తో సరునాక్‌ వితిద్‌సర్ణ్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓడింది. ఆదివారం జరగనున్న ఫైనల్లో సరునాక్‌తో ఇషారాణి తలపడనుంది. మరోవైపు పురుషుల సెమీఫైనల్లో ప్రణయ్‌ 13–21, 8–21తో జియా హెంగ్‌ చేతిలో ఓడాడు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement