ఫైనల్లో అష్మిత | Ashmita advances to final of Korea Masters World Tour Super 300 badminton tournament | Sakshi
Sakshi News home page

ఫైనల్లో అష్మిత

Aug 9 2026 3:44 AM | Updated on Aug 9 2026 3:44 AM

Ashmita advances to final of Korea Masters World Tour Super 300 badminton tournament

సియోల్‌: కొరియా మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత రైజింగ్‌ స్టార్‌ అష్మిత చాలిహా ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో ప్రపంచ 50వ ర్యాంకర్‌ అషి్మత 21–13, 16–21, 21–13తో భారత్‌కే చెందిన రక్షిత శ్రీపై విజయం సాధించింది. 

బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ సింగిల్స్‌ ఫైనల్‌ చేరడం అష్మితకు ఇదే తొలిసారి. క్వార్టర్స్‌లో ప్రపంచ 22వ ర్యాంకర్, టాప్‌ సీడ్‌ హినా అకెచి (జపాన్‌)ను ఓడించిన అష్మిత... నేడు జరగనున్న ఫైనల్లో నాలుగో సీడ్‌ హాన్‌ క్సియాన్‌ జీ (చైనా)తో తలపడనుంది. గత వారం భారత యువ షట్లర్‌ తన్వీ శర్మ తైపీ ఓపెన్‌ టైటిల్‌ సాధించగా... ఇప్పుడు అష్మిత కొరియా ఓపెన్‌ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement