మెస్సీ ఇంట తీవ్ర విషాదం | Jorge Messi Passed Away: Lionel Messi's Father Jorge Horacio Messi Dies at 68 in Rosario | Sakshi
Sakshi News home page

మెస్సీ ఇంట తీవ్ర విషాదం

Aug 8 2026 6:59 PM | Updated on Aug 8 2026 7:18 PM

Jorge Messi, father of soccer great Lionel Messi dead at 68

ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మెస్సీ తండ్రి  జార్జ్ హొరాసియో మెస్సీ (68) కన్నుమూశారని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. జార్జ్‌ మెస్సీ అర్జెంటీనాలోని రొసారియోలో శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు సమాచారం.

జార్జ్ మెస్సీ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన మృతికి గల ఖచ్చితమైన కారణాన్ని ఎవరూ వెల్లడించలేదు.

మెస్సీ కెరీర్‌లో కీలక పాత్ర
లియోనెల్ మెస్సీ ఫుట్‌బాల్ ప్రయాణంలో జార్జ్ మెస్సీ పాత్ర ఎంతో కీలకం. చిన్నతనం నుంచే తన కుమారుడి కెరీర్‌ను దగ్గరుండి పర్యవేక్షించిన ఆయన, మెస్సీ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్‌లోకి అడుగుపెట్టిన తర్వాత కూడా అతడి ప్రతినిధిగా, సలహాదారుగా వ్యవహరించారు.

మెస్సీ చిన్న వయసులోనే స్పెయిన్‌లోని బార్సిలోనాకు వెళ్లిన సమయంలో కూడా జార్జ్ ఆయన వెంట ఉన్నారు. అనంతరం మెస్సీ కెరీర్‌కు సంబంధించిన ఆర్థిక, వృత్తిపరమైన వ్యవహారాల్లోనూ ఆయన కీలక పాత్ర పోషించారు.

జూన్‌లో అనారోగ్యంపై వార్తలు
జార్జ్ మెస్సీ అనారోగ్యానికి గురైన విషయం జూన్‌లో వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో ఆయన ఆరోగ్యంపై పలు ఊహాగానాలు వచ్చినప్పటికీ, కుటుంబం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది.

2026 ఫిఫా ప్రపంచకప్ సమయంలోనూ జార్జ్ మెస్సీ ఆరోగ్యంపై తప్పుడు మరణవార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కుటుంబం ఆ వార్తలను ఖండించింది.

ప్రస్తుతం ఆయన మరణించినట్లు పలు నివేదికలు ధృవీకరిస్తున్నాయి. రొసారియోలోని ఓ ఆసుపత్రిలో దీర్ఘకాలిక అనారోగ్యంతో పోరాడుతూ ఆయన మరణించినట్లు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement