source: X
భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ కీలకమైన హండ్రెడ్ లీగ్ నుంచి మధ్యలోనే వైదొలిగింది. హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా ఆమె భారత్‌కు తిరిగి రానుంది. త్వరలో జరుగబోయే ఆసియా కప్‌కు కూడా ఆమె అందుబాటులో ఉండే అవకాశం లేదని తెలుస్తోంది.
హండ్రెడ్ లీగ్‌లో జెమీ సదర్న్ బ్రేవ్‌కు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఆమె కోసం ఫ్రాంచైజీ ఏకంగా 60,000 పౌండ్లు చెల్లించింది. అయితే గాయం కారణంగా టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు ఆమె దూరం కానుంది.
చార్లీ నాట్‌కు అవకాశం
జెమీమా స్థానంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ చార్లీ నాట్‌ను సదర్న్ బ్రేవ్ ఎంపిక చేసింది. ఈ సీజన్‌లో జెమీమా 6 మ్యాచ్‌ల్లో 143 పరుగులు చేసింది. ఆమె సగటు 35.75గా ఉంది. ఒక్క అర్ధశతకం కూడా నమోదు చేయకపోయినా వరుసగా మూడు మ్యాచ్‌ల్లో 25కు పైగా పరుగులు సాధించింది.
మరోవైపు చార్లీ నాట్ ఇటీవల ముగిసిన టీ20 బ్లాస్ట్‌లో అద్భుతంగా రాణించింది. 13 ఇన్నింగ్స్‌ల్లో 40.40 సగటున, 404 పరుగులు చేసి ఆకట్టుకుంది.
సదర్న్ బ్రేవ్‌కు ఈ సీజన్‌లో మంచి ఫలితాలు వస్తున్నాయి. ఆరు మ్యాచ్‌ల్లో 20 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.
ఆసియా కప్ కూడా దూరమయ్యే ప్రమాదం
గాయం కారణంగా హండ్రెడ్ లీగ్‌కు దూరమైన జెమీమా, ఆగస్టు 28 నుంచి జరుగబోయే ఆసియా కప్‌కు కూడా దూరమయ్యే ప్రమాదముందని తెలుస్తోంది. ఈ టోర్నీ కోసం ప్రకటించిన భారత జట్టులో జెమీమాకు ఇప్పటికే చోటు దక్కింది.
ఆసియా కప్ 2026 కోసం భారత జట్టు..
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, భారతి ఫుల్మాలి, రిచా ఘోష్ (వికెట్ కీపర్), జీ. కమలిని (వికెట్ కీపర్), దీప్తి శర్మ, రాధా యాదవ్, ప్రేమా రావత్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్, ఎన్. శ్రీ చరణి, నందిని శర్మ.
రిజర్వ్ ఆటగాళ్లు: ప్రతికా రావల్, ఉమా చెత్రీ, వైష్ణవి శర్మ, సయాలి సత్ఘరే, మిన్ను మణి.
జెమీమా ఆడకపోతే ఎవరికి అవకాశం..?
జెమీమా ఆసియా కప్‌కు దూరమైతే ఆమె స్థానాన్ని భర్తీ చేసే అవకాశాల్లో ప్రతికా రావల్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. భారత జట్టులో ప్రధాన బ్యాటర్లలో జెమీమా స్థానాన్ని భర్తీ చేయగల రిజర్వ్ ఆటగాళ్లలో ప్రతికా కీలకంగా కనిపిస్తోంది.
అయితే ప్రతికా ఇప్పటివరకు భారత తరఫున టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు. ఆసియా కప్‌లో అవకాశం వస్తే ఆమెకు అదే తొలి టీ20 అంతర్జాతీయ మ్యాచ్ కావొచ్చు.


