ధోని (PC: BCCI X)
మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కెప్టెన్‌గా టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ఘనత అతడిది. ధోని సారథ్యంలో టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్‌కప్-2011, చాంపియన్స్ ట్రోఫీ-2013లను భారత్ కైవసం చేసుకుంది.
ఇక ఐపీఎల్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపాడు ధోని. కాగా ధోనికి మిస్టర్ కూల్ అన్న ‘బిరుదు’ ఉన్న ఉన్న సంగతి తెలిసిందే. మైదానంలో ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సహనం కోల్పోకుండా వ్యూహాలు అమలు చేయడంలో దిట్ట.
అదే విధంగా ఆటగాళ్లకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మార్గనిర్దేశనం చేస్తాడనే పేరు అతడికి ఉంది. టీమిండియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడిన అజింక్య రహానే సైతం ఇదే మాట అంటున్నాడు. ఓవర్‌ల్యాప్ క్రికెట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..
ఒకేసారి 10- 15 మంది ఆటగాళ్లు
‘‘ధోని కామ్‌గా, కూల్‌గా ఉంటాడు. అందరిలాగే తానూ ఒకడినంటూ చాలా సాధారణంగా ఉంటాడు. ధోని గది ఎల్లప్పుడూ ఆటగాళ్లతో నిండి ఉంటుంది. ఒకేసారి 10- 15 మంది ఆటగాళ్లు అతడి రూమ్‌లోకి వచ్చి ఆట గురించి మాట్లాడుతూ ఉంటారు.
ఒక్కోసారి జట్టు మొత్తం అక్కడే ఉంటుంది. అయితే, అంతా అయిపోయి ఒక్కసారి ధోని గది తలుపు మూతపడిందంటే మాత్రం.. మళ్లీ ఎవరికీ లోపలికి అనుమతి ఉండదు’’ అని రహానే చెప్పుకొచ్చాడు.
రహానే గుడ్‌బై
కాగా రహానే ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. టెస్టు క్రికెట్‌లో సారథిగా ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించిన ఘనత అతడికి ఉంది.
టీమిండియా తరఫున 2011లో అరంగేట్రం చేసిన రహానే.. 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 12 శతకాల సాయంతో 5077 పరుగులు సాధించాడు. వన్డేల్లో 2962, టీ20లలో 375 పరుగులు చేసిన రహానే.. ఐపీఎల్‌లో మొత్తంగా 5367 పరుగులు సాధించాడు. ధోని కెప్టెన్సీలో 2023లో చెన్నై టైటిల్ గెలవడంలో రహానే (326 రన్స్) తన వంతు పాత్ర పోషించాడు.


