తైపీ: భారత బ్యాడ్మింటన్ రైజింగ్ స్టార్ తన్వీ శర్మ తైపీ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో 17 ఏళ్ల తన్వీ 21–17, 21–11తో ప్రపంచ 24వ ర్యాంకర్ హువాంగ్ యు సున్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించింది. 33 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో తన్వీ వరుస గేమ్‌ల్లో విజృంభించింది.
ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుస పాయింట్లతో విజయం సాధించింది. గతేడాది యూఎస్ ఓపెన్ సూపర్–300 టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన తన్వీ నేడు జరిగే ఫైనల్లో ఆరో సీడ్ థుయ్ లిన్ నుగుయెన్ (వియత్నాం)తో తలపడనుంది. మరో సెమీఫైనల్లో ఉన్నతి హుడా 15–21, 18–21తో ప్రపంచ 21వ ర్యాంకర్ థుయ్ లిన్ నుగుయెన్ చేతిలో పోరాడి ఓడింది.


