న్యూఢిల్లీ: కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత ప్యాడ్లర్లు సత్తాచాటుతున్నారు. మహిళ ల, పురుషుల విభాగాల్లో మొత్తం ఎనిమిది మంది భార త ప్లేయర్లు సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ ప్లేయర్, రెండో సీడ్ ఆకుల శ్రీజ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శనివారం 13–11, 11–4, 11–9, 12–10తో టిన్ టిన్ హో (ఇంగ్లండ్)పై ఏకపక్ష విజయం నమోదు చేసుకుంది.
మరో క్వార్టర్ ఫైనల్లో సిండ్రెలా దాస్ 10–12, 11–9, 12–10, 11–8, 7–11, 11–8తో టాప్ సీడ్ యాంగ్జీ లూ (ఆస్ట్రేలియా)పై సంచలన విజయం సాధించింది. ఇతర మ్యాచ్‌ల్లో యశస్విని 4–0తో కాన్‌స్టాంటినా (ఆస్ట్రేలియా)పై... సుతీర్థ ముఖర్జీ 4–1తో మిన్ హ్యూంగ్ జీ (ఆస్ట్రేలి యా)పై గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టారు.
ఇక పురుషుల విభాగంలో టాప్ సీడ్ మనుశ్ షా 11–6, 11–8, 2–11, 13–15, 11–8, 11–5తో ఆదిత్య సరీన్ (ఆస్ట్రేలియా)పై... పాయస్ జైన్ 8–11, 12–10, 12–14, 12–10, 11–6, 11–9తో భారత్‌కే చెందిన హర్మీత్ దేశాయ్‌పై గెలుపొందారు. అంకుర్ భట్టాచార్య 7–11, 15–13, 10–12, 11–5, 11–9, 11–9తో నికోలస్ వెన్ జెంగ్ లుమ్ (ఆస్ట్రేలి యా)పై... మానవ్ ఠక్కర్ 5–11, 11–8, 13–11, 11–8, 11–6తో అలెగ్జాండర్ గ్రీన్ (ఇంగ్లండ్)పై విజయాలతో ముందంజ వేశారు.


