సౌత్‌ జోన్‌ సారథిగా తిలక్‌ వర్మ | Tilak Verma as South Zone captain | Sakshi
Sakshi News home page

సౌత్‌ జోన్‌ సారథిగా తిలక్‌ వర్మ

Aug 2 2026 3:47 AM | Updated on Aug 2 2026 3:47 AM

Tilak Verma as South Zone captain

బెంగళూరు: దేశవాళీ క్రికెట్‌ టోర్నమెంట్‌ దులీప్‌ ట్రోఫీలో పాల్గొనే సౌత్‌ జోన్‌ జట్టుకు తిలక్‌వర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (సీఓఈ)లో జరగనున్న ఈ టోర్నమెంట్‌ కోసం సౌత్‌ జోన్‌ సెలక్టర్లు శనివారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించారు. 

భారత టి20 జట్టుకు వైస్‌కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న తిలక్‌ వర్మ ఈ జట్టుకు సారథిగా ఎంపిక కాగా... ఆంధ్రప్రదేశ్‌ సీనియర్‌ ప్లేయర్‌ రికూ భుయ్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. భారత సీనియర్‌ ఆటగాడు కరుణ్‌ నాయర్‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన హిమతేజ జట్టులో చోటు దక్కించుకున్నారు.  ఆంధ్రప్రదేశ్‌ యువ ఆటగాడు షేక్‌ రషీద్‌కు కూడా  చోటు దక్కింది.  

సౌత్‌ జోన్‌ జట్టు: తిలక్‌ వర్మ (కెప్టెన్‌), రికీ భుయ్, అభినవ్, షేక్‌ రషీద్, హిమతేజ, స్మరణ్, జగదీషన్, కరుణ్‌ నాయర్, త్యాగరాజన్, శ్రేయస్‌ గోపాల్, సాయితేజ, విజయ్, కవెరప్ప, అమన్‌ ఖాన్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement